Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్‌లో పుష్ప హవా.. ఏకంగా అన్ని అవార్డులు.. సాయి పల్లవి సెన్సేషనల్ రికార్డు

సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాళ్లు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఫిల్మ్‌ఫేర్ ఒకటి. దేశంలోని పలు ఇండస్ట్రీలకు వేరు వేరుగా ఇచ్చే ఈ అవార్డుల వేడుక ఇప్పుడు 67వ వసంతాన్ని జరుపుకుంటోంది. గత ఆగస్టులో హిందీ రంగానికి సంబంధించి పురస్కారాలను అందించారు. ఇక, ఇప్పుడు సౌత్ ఇండియాలోని సినీ ఇండస్ట్రీలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించి ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎవరిని వరించాయో పూర్తి వివరాలు మీరే చూడండి!

వైభవంగా ఫిల్మ్‌ఫేర్ వేడుక

వైభవంగా ఫిల్మ్‌ఫేర్ వేడుక


ఇండియన్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే 'ఫిల్మ్‌ఫేర్' 67వ అవార్డుల కార్యక్రమం బెంగళూరు నగరంలోని ఇంటర్నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో దక్షిణాదిలోని పరిశ్రమలకు చెందిన ఎంతో మంది స్టార్లు సందడి చేశారు. మరీ ముఖ్యంగా కొందరు నటీనటులు అదిరిపోయే ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు.

 పుష్ప మూవీకి ఏడు అవార్డ్స్

పుష్ప మూవీకి ఏడు అవార్డ్స్


ఫిల్మ్‌ఫేర్ 2022 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న 'పుష్ప' సినిమా హవాను చూపించింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. మొత్తంగా దీనికి ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం అయ్యాయి.

 తగ్గేదేలే అన్న అల్లు అర్జున్

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్


2022 ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా 'పుష్ప' చిత్రంలోని నటనకు గానూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ఈ ఫంక్షన్ స్టేజ్‌పై అవార్డును అందుకున్న వెంటనే అతడు తగ్గేదేలే అంటూ తనదైన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు, పుష్ప సినిమాలోని పాటలకు కూడా స్టెప్పులేశాడు. బన్నీతో పాటు చిత్ర యూనిట్ మొత్తం స్టేజ్‌పై సందడి చేసింది.

శ్యామ్.. ఉప్పెనకు రెండేసి

శ్యామ్.. ఉప్పెనకు రెండేసి


నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన చిత్రం 'శ్యామ్ సింగా రాయ్'. దీనికి 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. విమర్శకుల ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా సాయి పల్లవి అవార్డులను అందుకున్నారు. అలాగే, 'ఉప్పెన' చిత్రానికి గానూ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఉత్తమ తొలిచిత్ర హీరో, హీరోయిన్లుగా నిలిచారు.

 సాయి పల్లవి గొప్ప రికార్డు

సాయి పల్లవి గొప్ప రికార్డు


అంగరంగ వైభవంగా జరిగిన 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 'శ్యామ్ సింగా రాయ్' చిత్రానికి గానూ ఉత్తమ నటిగా క్రిటిక్స్ చాయిస్ అవార్డును అందుకున్న ఈమె.. 'లవ్ స్టోరి' మూవీలో కనబరిచిన నటనకు గానూ బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచింది. ఇలా ఒకేసారి రెండు అవార్డులతో రికార్డు కొట్టేసింది.

ఫిల్మ్‌ఫేర్ విజేతలు.. పూర్తి వివరాలివే

ఫిల్మ్‌ఫేర్ విజేతలు.. పూర్తి వివరాలివే

ఉత్తమ చిత్రం: పుష్ప
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి: సాయి పల్లవి (లవ్ స్టోరి)
ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల.. వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి: టబు (అల.. వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప)
ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (లైఫ్ ఆఫ్ రామ్ పాట)
ఉత్తమ గాయకుడు: సిద్ శ్రీరామ్ (శ్రీవల్లి పాట)
ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ (ఊ అంటావా మావ పాట)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (శ్యామ్ సింగా రాయ్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): సాయి పల్లవి (శ్యామ్ సింగా రాయ్)
ఉత్తమ నూతన హీరో: పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
ఉత్తమ నూతన నటి : కృతి శెట్టి (ఉప్పెన)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మిరోస్లా కూబా (పుష్ప)
ఉత్తమ నృత్య దర్శకుడు: శేఖర్ మాస్టర్ (రాములో రాములా)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X