ఎట్టకేలకు దిల్ రాజుకి జ్ఞానోదయం.. ఆ డైరెక్టర్ పనితో మళ్ళీ పాత రోజులు వస్తాయా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి టాప్ నిర్మాతల్లో ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా ఒకరు. మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్ గానే మొదలు పెట్టి ఇపుడు భారీ సినిమాలు చేసే నిర్మాతగా తాను నిలిచారు. అయితే అన్ని రోజులు ఇండస్ట్రీలో ఒకేలా ఉండవు. ఒక టైంలో చాలా తో భారీ లాభాలు అందించే సినిమాలు ఎన్నో చేసిన దిల్ రాజు గత కొన్నేళ్లుగా మాత్రం ఏది పట్టుకున్నా బూడిదే మిగులుతుంది.

కాగా టాలీవుడ్ లో తన ఫామ్ కోల్పోవడం ఇతర నిర్మాతలతో మరింత పోటీ వాతావరణం నెలకొనడంతో ఒక్కసారిగా దిల్ రాజు పరిస్థితి తారు మారు అయింది. అయినప్పటికీ తమ కెరీర్లోనే పలు భారీ బడ్జెట్ సినిమాలు చేసి ఊహించని దెబ్బ తాను తిన్నారు. తాను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ సమంతతో చేసిన "శాకుంతలం" అనే సినిమా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు అని ఆ మధ్య దిల్ రాజు చెప్పారు.

finally dil raju realised with anil ravipudi will he comeback

చాలా బడ్జెట్ పెడితే ఆ సినిమాకి అసలు వసూళ్లే రాలేదు. దీనితో దిల్ రాజు కెరీర్లో అది బిగ్గెస్ట్ ప్లాప్ అయితే లేటెస్ట్ గా చేసిన మరో భారీ పాన్ ఇండియా చిత్రం "గేమ్ ఛేంజర్"తో మాత్రం ఊహించని దెబ్బ పడింది. ఈ సినిమా కంటెంట్ కోసం పక్కన పెడితే బయట నుంచి జరిగిన నెగిటివిటీ మూలాన సినిమా చచ్చిపోయింది అని మెగా అభిమానులు అంటున్నారు.

కానీ ఈ సినిమా తోనే టాలీవుడ్ లో చాలా లెక్కలు, లూప్ హొల్స్ బయటకి వచ్చాయి. ఫేక్ వసూళ్ల పోస్టర్స్ ముచ్చట నుంచి మళ్ళీ నేను నా పాత సినిమాలు మాత్రమే చేసుకుంటాను అనే రేంజ్ లో దిల్ రాజుకి జ్ఞానోదయం కలగడం విశేషం. మరి దిల్ రాజు ఇదే గేమ్ ఛేంజర్ తో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రిలీజ్ చేసి చాలా సేఫ్ అయ్యారు.

ఈ సినిమాలు రెండూ ఒకేసారి అమ్మి మంచి లాభాలు అందుకోగా ఎప్పుడు లేని విధంగా డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ తనకి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడిపై చేసిన కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. ఇపుడు ఉన్న రోజుల్లో భారీ బడ్జెట్ లతో పాటుగా కంటెంట్ కూడా ముఖ్యం అని అనీల్ ప్రూవ్ చేసాడని ఒకప్పుడు నేను భారీ బడ్జెట్ లకి పోకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేశాను.

మళ్ళీ అలాంటి సినిమాలే చెయ్యాలని అనీల్ రావిపూడి మాకు మళ్ళీ ఒక మార్గదర్శకం అయ్యారు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ అందించారు. దీనితో తనపై తానే పలు భారీ సినిమాల విషయంలో నింద వేసుకున్నారని చెప్పవచ్చు. అలాగే ఈ స్టేట్మెంట్ తోనే మళ్ళీ దిల్ రాజు బిగ్ బడ్జెట్ లు పాన్ ఇండియా సినిమాల జోలికి కూడా వెళ్లబోరు అని చెప్పి తీరాలి. సో మళ్ళీ వింటేజ్ లా దిల్ రాజు నుంచి చిన్న బడ్జెట్ తో భారీ లాభాలు అందించే విధంగా ప్రణాళికలు వేసుకుంటారో లేదో కాలమే నిర్ణయించాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X