twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ సినిమా కోర్టు ఆదేశాలతో నిలుపుదల.. అందుకే ఆపేశాం.. ఫైనాన్సియర్ క్లారిటి!

    |

    టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శేఖర్ సినిమా థియేటర్స్ లో కొనసాగుతుండగా ఆదివారం రోజు హఠాత్తుగా అన్ని థియేటర్స్ నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు ఆదేశాల ప్రకారమే ఈ విధంగా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ముందుగానే రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలో స్పందించి కావాలని తన సినిమా పై కుట్ర చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఎందుకు శేఖర్ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి? అనే వివరాల్లోకి వెళితే..

     శేఖర్ సినిమాకు బ్రేక్

    శేఖర్ సినిమాకు బ్రేక్

    జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా గత శుక్రవారం గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వారి కూతురు శివాని రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. అయితే శేఖర్ సినిమా విడుదలైన రెండు రోజులకే ఊహించని సమస్యల్లో పడింది. కోర్టు ఆదేశాలతో ఈ సినిమాని నిలిపి వేసినట్లుగా తెలుస్తోంది.

    ఆ కారణంగా కోర్టుకు

    ఆ కారణంగా కోర్టుకు

    'శేఖర్' సినిమా ప్రదర్శన అన్ని ప్రాంతాలలో కూడా ఆగిపోయింది. కోర్టు ఆదేశాలను అనుసరించి థియేటర్ల వారు ఆదివారం నిలుపుదల చేశారని ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డి తెలిపారు. తన దగ్గర అప్పుగా అరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్న నిర్మాత,దర్శకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడం వలనే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

    అరవై ఐదు లక్షలు సమర్పించాలి

    అరవై ఐదు లక్షలు సమర్పించాలి

    హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టులో జీవిత రాజశేఖర్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక సినిమా విడుదల అనంతరం 48 గంటల లోపు అరవై ఐదు లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని అన్నారు. అయితే ఒకవేళ అలా డిపాజిట్ చేయలేని క్రమంలో ''శేఖర్" సినిమాకు సంబందించిన షోలను ప్రదర్శించడానికి వీలు లేదని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా పరంధామరెడ్డి వివరించారు.

    ఎక్కడా ప్రసారం చేయకూడదు.

    ఎక్కడా ప్రసారం చేయకూడదు.

    థియేటర్స్ లో కాకుండా డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ ఇలా సర్వ హక్కుల విషయంలో వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమాతో పాటు ట్రైలర్స్ అలాగే పాటలలను కూడా ఎక్కడా ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా 'శేఖర్" సినిమాను ప్రదర్శిస్తే న్యాయస్థాన ధిక్కరణ అవుతుందని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు.

    భయపడేది లేదు

    భయపడేది లేదు

    శేఖర్ సినిమాకు నిర్మాత తానే అంటూ ఎవరైనా ప్రదర్శనకు ఆటంకం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తానని బీరం సుధాకర్ రెడ్డి తెలియజేశారు. అయితే తాను చట్టపరంగా ఈ వ్యవహారంపై పోరాటం చేస్తానని.. అలాంటి మాటలకు భయపడేది లేదని పరంధామరెడ్డి వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం అయితే శేఖర్ సినిమాను పూర్తిగా నిలిపివేశారు.

    వారికి ధన్యవాదాలు అంటూ..

    వారికి ధన్యవాదాలు అంటూ..

    ఇక కోర్టు ఆదేశాల మేరకు శేఖర్ సినిమా ప్రదర్శనలను నిలుపుదల చేసిన థియేటర్స్ వారికి అలాగే డిజిటల్ ప్రొవైడర్స్ వారికి ఎ.పరంధామరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే సినిమా హీరో రాజశేఖర్ మాత్రం ఈ ఉదయమే శేఖర్ సినిమాపై కొందరు కావాలని కుట్ర చేసి అడ్డుకుంటున్నట్లు సోషల్ మీడియాలో స్పందించారు. మరి ఈ విషయంలో ఇంకా ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

    English summary
    Movie Financiar clarification on shekar movie issues and full details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X