జోధా అక్బర్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆర్ట్ డైరెక్టర్ భావొద్వేగం!
"జోధా అక్బర్" సినిమా కోసం నిర్మించిన సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మే 7న కర్జాత్‌లోని ఎన్‌డి స్టూడియోలో "జోధా అక్బర్" సినిమా కోసం నిర్మించిన శాశ్వత సెట్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో ఆ సెట్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా 'జోధా అక్బర్' కోసం 2007లో ఈ సెట్ ను నిర్మించారు.
అయితే తర్వాత ఏక్తా కపూర్ నిర్మించిన టెలివిజన్ సీరియల్ 'జోధా అక్బర్' సీరియల్ షూటింగ్ కూడా 2013- 2014 మధ్య ఇక్కడే జరిగింది. ఈ సీరియల్ లో రజత్ తోకాస్, పరిధి శర్మ జోధా అక్బర్ లుగా నటించారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో లాక్డౌన్ కారణంగా ఎటువంటి సినిమా, సీరియల్ షూటింగులు జరగట్లేదు. దీంతో ఆ భారీ సెట్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పై నుంచి మంటలు స్టూడియో గోడలను తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మంటలను అరికట్టడానికి ఫైర్ ఇంజన్లతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేలోగా పూర్తిగా మంటలు అలుముకున్నట్టు తెలుస్తోంది. హృతిక్ రోషన్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన 'జోధా అక్బర్' యొక్క శాశ్వత సెట్ మంటల్లో ధ్వంసమైందని ధృవీకరించినప్పుడు ఆర్ట్ డైరెక్టర్ మరియు ఎన్డి స్టూడియోస్ యజమాని నితిన్ దేశాయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత అక్కడికి చేరుకున్న దేశాయ్, "ఈ కలల ప్రాజెక్టులో చెమట మరియు రక్తం ధారపోశాను, అవన్నీ పోయాయి అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











