Devara : జూ. ఎన్టీఆర్ కటౌట్‌కి నిప్పు... థియేటర్‌లో వందల మంది చూస్తుండగానే, ఎవరి పని?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ దేవర. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ .. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఆర్ఆర్ఆర్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్దకు అభిమానులు పోటెత్తడంతో పండుగ వాతావరణం నెలకొంది. అయితే కొన్నిచోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే :
దేవర ద్వారా జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్‌లు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మితిమీరిన హింస , రక్తపాతం ఉన్నప్పటికీ సెన్సార్ బోర్డ్ దేవరకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. .

నెల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఈ విషయంలో దేవర చరిత్ర సృష్టించింది. రిలీజ్‌కు ముందే 10 లక్షల పైగా టికెట్లను విక్రయించినట్లుగా బుక్ మై షో తెలిపింది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ టికెట్లు అమ్ముడైనట్లుగా బుక్ మై షో పేర్కొంది. గుంటూరు జిల్లాలో అయితే దేవర సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటికే దాదాపు 90 శాతం ఆక్యూపెన్సీ నమోదు చేయగా.. 47 వేల వరకు టికెట్లు అమ్ముడపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా దేవర రూ.1.15 కోట్లు వసూళ్లను ముందే రాబట్టినట్లుగా విశ్లేషకులు అంటున్నారు.
ఇకపోతే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పెషల్ షోలు వేసుకునేందుకు, టికెట్ ధరలు పెంచుకునేందుకు దేవర చిత్ర నిర్మాతలకు అనుమతులు ఇచ్చాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి 1 గంటకు ప్రత్యేక షోలు వేయడానికి అనుమతించింది. అమెరికాలో అయితే ప్రీమియర్స్ ద్వారానే 2.8 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు. తద్వారా తెలుగు సినిమాల విషయంలో అత్యధిక ప్రీమియర్స్ సాధించిన చిత్రాల్లో కల్కి 2898 ఏడీ (3.9 మిలియన్లు) , ఆర్ఆర్ఆర్ (3.46 మిలియన్లు) తర్వాతి స్థానంలో నిలిచాయి.
కాగా.. సినిమా రిలీజ్ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే దేవర ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్ వద్ద ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేవర రిలీజ్ సందర్భంగా అభిమానులు బాణాసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి పక్కనే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్‌కి మంటలు అంటుకున్నాయి. వందలాది మంది అభిమానులు చూస్తుండగానే కటౌట్ దగ్ధమైంది.


Click it and Unblock the Notifications











