twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంజారా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సేవాదాస్.. గెస్టులుగా మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు

    |

    శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కేపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం సేవాదాస్. టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కేపీఎన్ చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. బంజారా, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ చిత్రానికి భోలే షావలి సంగీతాన్ని అందించారు.

    బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన, మహిళా సంక్షేమశాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ బానోత్, ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, వైరా ఎమ్మెల్యే ఎల్ రాములు నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా ఉన్న పలువురు ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు

    First Banjara Movie Sevadas in Telugu, Hindi, English, Banjara Languages

    సేవాదాస్‌గా టైటిల్ రోల్ ప్లే చేసిన సుమన్, కీలకపాత్ర పోషించిన భానుచందర్, చిత్ర దర్శకుడు-కథానాయకుడు కేపీఎన్ చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని, గీతా సింగ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. సేవాదాస్ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

    First Banjara Movie Sevadas in Telugu, Hindi, English, Banjara Languages

    మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... సేవాదాస్ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. సేవాదాస్ చిత్రం కచ్చితంగా 100 రోజులు ఆడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి అని అన్నారు.

    ముఖ్య అతిధి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తీసిన సేవాదాస్ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొనడం గర్వంగా ఉంది అని అన్నారు.

    First Banjara Movie Sevadas in Telugu, Hindi, English, Banjara Languages

    నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ మాట్లాడుతూ... సేవాదాస్ రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నాం. ఈ నెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు.

    నటీనటులు: వినోద్ రైనా, ఎస్ఆర్ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ తదితరులు
    కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కేపిఎన్. చౌహాన్
    నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్
    అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్, చిరుత రవితేజ, సంజయ్ భూషణ్, సాయి కుమార్
    కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు, నవీన్
    వీఎఫ్ఎక్స్: కిషోర్ కాలకూరి
    ఆర్ట్ డైరెక్టర్: విజయ్ ఎ
    ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు, శ్రీరాములు
    కెమెరామెన్: విజయ్ టాగోర్
    ఎడిటర్: ప్రదీప్
    పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్
    పీఆర్వో: ధీరజ్ అప్పాజీ

    English summary
    Sevadas is a Banjara Language movie in Tollywood. in Telugu, Hindi, English, Banjara Languages
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X