అంతా ముందు మయమేనా? ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ నెక్ట్స్ మూవీ ఆసక్తిరంగా..

'ఆర్ఎక్స్ 100'తో భారీ విజయం అందుకోవడంతో పాటు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ అతడికి వరుస అవకాశాలు తెచ్చి పెట్టింది. అయితే తర్వాత ఈ యంగ్ హీరో చేసిన హిప్పి, గుణ 369 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు.

ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా విషయంలో కార్తికేయ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. త్వరలో 'ఆర్ఎక్స్ 100' చిత్రాన్ని నిర్మించిన 'కార్తికేయ క్రియేటివ్ వర్క్స్' బేనర్లో మరో సినిమా చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి నిర్మాత. శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా సినిమా గురించి కొన్ని వివరాలు వెల్లడిస్తూ ప్రీ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగా ఉంది.

First look and Title of Actor Kartikeyas next out on September 9th!

పోస్టర్లో విస్కీ బాటిల్‌తో పాటు పక్కనే చిన్న పిల్లలు తాగే పాల సీసాలో కూడా ముందు పోసి ఉండటం, ఓ పసివాడు ఆ పాల సీసాను అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చూపించడం బట్టి సినిమాలో హీరో మందుకు అడిక్ట్ అయిన వ్యక్తిగా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X