వైఎస్ విజయమ్మను చూసినట్లే ఉంది.. ‘యాత్ర’లో ఆశ్రిత వేముగంటి ఫస్ట్ లుక్ ఇదే..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తండగా, ఆయన సతీమణి విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి కనిపించబోతున్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రంలోని ముఖ్యపాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా వైఎస్ విజయమ్మ పాత్ర పోషిస్తున్న ఆశ్రిత వేముగంటి పోస్టర్ చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'ఆనందో బ్రహ్మ వంటి' సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో 'యాత్ర' ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పాదయాత్రను ప్రధానంగా ఫోస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు.
మమ్ముట్టి, రావ్ రమేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, 30 ఇయర్స్ పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సినిమాటోగ్రాఫర్ - సత్యన్ సూర్యన్, మ్యూజిక్ - కె ( క్రిష్ణ కుమార్ ), ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్, సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ప్రొడక్షన్ డిజైన్ - రామకృష్ణ, మోనిక సబ్బాని, సౌండ్ డిజైన్ - సింక్ సౌండ్, సమర్పణ - శివ మేక, బ్యానర్ - 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు - విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - మహి వి రాఘవ్.


Click it and Unblock the Notifications











