twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా టైటిల్ ‘హీరో హీరోయిన్’.. పైరసీ నేపథ్యంతో స్టోరీ!

    |

    'హీరో హీరోయిన్'.. ఇది త్వరలో తెలుగులో రాబోతున్న ఓ సినిమా టైటిల్. 'ఎ పైరేటెడ్ లవ్ స్టోరీ' అనే సబ్ టైటిల్. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కోణంలో రాబోతున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర హీరోగా, గాయత్రి సురేష్, పూజా జవేరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    అడ్డా ఫేం జీయస్ కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని స్వాతి పిక్చర్స్ పతాకంపై భార్గవ్ మన్నె నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై అటెన్షన్ వచ్చేలా చేసింది.

    First Look of Hero Heroine released

    దర్శకుడు మాట్లాడుతూ.. విభిన్న నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ, పైరసీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో చాలా భావోద్వేగాలు ఉంటాయి. నవీన్‌చంద్ర పాత్ర ఆకట్టుకునే విధంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమని తెలిపారు.

    నవీన్‌చంద్ర, గాయత్రి సురేష్, పూజా జవేరి, అభిమన్యు సింగ్, కబీర్‌సింగ్, జయప్రకాష్ రెడ్డి, షేకింగ్ శేషు, రణధీర్, గౌతంరాజు, శివన్నారాయణ, బమ్‌చిక్ బబ్లూ, సారిక రామచంద్రరావు తదితరులు నటిసున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నె, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వెంకట్ గంగాధరీ, ఎడిటర్: జునైద్ సిద్ధికి, ఫైట్స్: రియల్ సతీష్, నిర్మాత: భార్గవ్ మన్నె, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: జీయస్ కార్తీక్.

    English summary
    First Look of 'Hero Heroine' A Pirated Lovestroy starring Naveen Chandra, Gayatri Suresh, Pooja Javeri. Directed by GS Karthik. Produced by Bhargav Manne.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X