‘కోబ్రా’ ఫస్ట్ లుక్: నా మొహం చూసి నవ్వొద్దు.. ఏడ్చేస్తానన్న రామ్ గోపాల్ వర్మ

Recommended Video

RGV Birthday Celebrations And Cobra Movie First Look Launch || Filmibeat Telugu

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో 'కోబ్రా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు ఆర్జీవీ. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ ఆర్జీవీ పుట్టినరోజు(ఏప్రిల్ 7) సందర్భంగా జరిగింది.

''అత్యంత ప్రమాదకమైన ఓ క్రిమినల్ బయోపిక్ ఈ చిత్రమని.. అతడిని అరెస్ట్ చేస్తే సగం పోలీస్ డిపార్ట్‌మెంట్ జైలుకు వెళ్లాల్సిందే. శత్రువులను చంపడానికి మనం త్రాచుపామును పెంచుకుంటే.. ఒక్కోసారి అది మనల్నే కాటేస్తుంది'' అంటూ ఈ పోస్టర్ మీద ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. ఇందులో ఆర్జీవీ ఇంటిలిజెన్స్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్జీవీ ఆసక్తికరంగా ప్రసంగించారు.

బర్త్ డే అంటే నాకు చిరారు

బర్త్ డే అంటే నాకు చిరారు

‘‘బర్త్ డే అంటే నాకు చిరారు. అది వచ్చినప్పుడల్లా సంవత్సరం ఓల్డ్ అయిపోతున్నామనే భయం, ఒక సంవత్సరం చావుకు దగ్గర అవుతున్నామనే ఫీలింగ్ నాకు ఉంటుంది. వయసుపై, దేవుడిపై ఫైట్ చేయలేం కాబట్టి మిమ్మల్ని మానిప్యులేట్ చేయడానికి, ఏజ్ తక్కువగా కనిపించడానికి ఇలాంటి బట్టలు వేసుకున్నాను. పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం అనేది పిచ్చితనం. ప్రపంచంలో లక్షలు, కోట్ల మంది పుడతా ఉంటారు. దాంతో పాటు క్రిములు, జంతువులు పుడతాయి. మనం పుట్టిన తర్వాత ఏదైనా సాధిస్తే.. ఆ సాధించిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉందనేది నా అభిప్రాయం.'' అని వర్మ చెప్పుకొచ్చార.

మా పేరెంట్స్ కలిస్తే నేను పుట్టాను

మా పేరెంట్స్ కలిస్తే నేను పుట్టాను

‘‘నా క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే విషయంలో ఓ విషయం చెప్పాడు. ఈ బర్త్ డేలో ఏముంది? నీ పేరెంట్స్ ఏదో ఒక రోజు కలిశారు.. దాని మూలన నువ్వు పుట్టావ్.. దానికి నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? కానీ నువ్వు నువ్వుగా ఏదైనా చేసినపుడు దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇంత ఫిలాసఫీ నాకు ఉన్నా కూడా ఈ రోజు నేను ఈ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం... నా వెల్ విషర్స్, నా ఫ్యామిలీ వారి సంతోషం కోసం చేసుకుంటున్నాను.'' అని వర్మ వ్యాఖ్యానించారు.

‘కోబ్రాలో' నాది నెగెటివ్ రోల్

‘కోబ్రాలో' నాది నెగెటివ్ రోల్

‘‘ఈ రోజు నా నిజమైన పుట్టినరోజు అని భావిస్తున్నాను. నా కెరీర్లో తొలిసారిగా యాక్టర్‌గా పుట్టాను. సడెన్‌గా నాకు యాక్టర్ అవ్వాలనే కోతి బుద్ది ఇప్పుడే ఎందుకు కలిగింది అంటే.. ఈ స్క్రిప్టు రాస్తున్నపుడు ఈ పాత్ర చేయాలని అనిపించింది. ఇది యాక్షన్ క్రైమ్ డ్రామా. ఇందులో నాది నెగెటివ్ రోల్.'' అని వర్మ తెలిపారు.

ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్

ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్

ఈ అకేషన్లో ఇంకో బర్త్ డే ‘ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్'. ఫస్ట్ టైమ్ ఒక యునిక్ కంపెనీ.. పట్యిక్యులర్ ఫిలాసఫీతో ఎలాంటి సినిమాలు, ఎలాంటి జోనర్లో సినిమాలు తీయాలి అనే ఆలోచనలో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. నేను, డిపీఆర్ అనే వ్యక్తి కలిసి ఈ కంపెనీ స్థాపించాం. హిందీ, తెలుగులో 8 నుంచి 10 సినిమాలు తీయడానికి ఈ కంపెనీ పెట్టామని వర్మ చెప్పుకొచ్చారు.

నా లుక్ చూసి నవ్వొద్దు, నాకు ఏడుపొస్తుంది

నా లుక్ చూసి నవ్వొద్దు, నాకు ఏడుపొస్తుంది

‘‘సినిమాలో నా మొహం ఫస్ట్ లుక్ చూపించబోతున్నాను. అది చూసిన తర్వాత మీరు నవ్వొద్దు.. అలా చేస్తే నేను హర్ట్ అవుతాను, ఏడుస్తాను. నా కోసం మీరు బాగానే ఉంది అని చెబితే సంతోషిస్తాను. ఈ సినిమాకు ఉన్న మరో స్పెషల్ క్వాలిటీ... నా కెరీర్ బిగినింగులో ఎక్స్ ట్రార్డినరీ మ్యూజికల్ ఫిల్మ్ చేశాను. అందులో తొలిసారి కీరవాణితో చేశాను. నా మొత్తం కెరీర్లో అద్భుతమైన మ్యూజిక్ ఉన్న మూవీ అది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నేను, కీరవాణి గారు కలిసి ఈ సినిమాకు చేస్తున్నాం.'' అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

కోబ్రా

కోబ్రా చిత్రానికి రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్ పతాకంపై డిపీఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కెజి అనే నటుడు క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో రంగారావు, ఇంటిలిజెన్స్ ఆఫీసర్ ఆర్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X