రెండో పెళ్లి చేసుకొన్న క్రిష్ డైరెక్టర్.. భార్య ప్రీతి చల్లా ఎవరో తెలుసా?

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. గత కొద్ది రోజులుగా క్రిష్ వివాహం గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన ముగింపు పలికాడు. కొద్దికాలంగా ప్రేమిస్తున్న డాక్టర్ ప్రీతి చల్లా మెడలో మూడు మూళ్లు వేసి దాంపత్య జీవితానికి ఆరంభం పలికారు. పెళ్లి అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

క్రిష్ మొదటి వివాహం గురించిన వివరాల్లోకి వెళితే.. ఆయన 2016 ఆగస్టు 7వ తేదీన రమ్య అనే డాక్టర్‌ను వివాహం చేసుకొన్నారు. అయితే ఆయన దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని అనుకొన్న సమయంలోనే ఆయన వైవాహిక జీవితంలో భార్యతో అభిప్రాయ బేధాలు తలెత్తడంతో విడాకులు తప్పలేదు. రెండేళ్ల వ్యవధిలోనే రమ్యతో ఆయన డైవోర్స్ తీసుకొన్నారు.

First Photo of Director Krish Jagarlamudi marriage Photo Trending Who is Dr Priti Challa

మొదటి భార్యతో వివాహం తర్వాత గైనకాలజిస్ట్,డాక్టర్ ప్రీతి చల్లాతో ట్రావెల్ అవుతున్నారు. కొద్దికాలంలో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరూ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే గత వారం వారి పెళ్లి తేదీ మీడియాలో లీక్ అవ్వడంతో.. ఆ ఇద్దరి గురించిన వార్తలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

డాక్టర్ ప్రతీ చల్లా విషయానికి వస్తే.. చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం విదేశాల్లో ఉన్నత విద్య ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007 నుంచి ఆమె వైద్య వృత్తిలో ఉన్నారు. తన కుటుంబానికి చెందిన చల్లా హాస్పిటల్‌లో నాలుగో తరం వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు. ప్రీతి తల్లి కూడా ప్రముఖ వైద్యురాలే అనేది విశేషంగా చెప్పుకోవచ్చు.

First Photo of Director Krish Jagarlamudi marriage Photo Trending Who is Dr Priti Challa

అయితే ప్రీతీ చల్లాకు కూడా రెండో వివాహం కావడం గమనార్హం. గతంలో డాక్టర్ భరత్‌ను వివాహం చేసుకొన్నారు. అయితే సుమారు నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. అనంతరం క్రిష్‌తో జరిగిన పరిచయం వారిద్దరి మనసులు దగ్గరయ్యాయి. కొంతకాలం ప్రేమాయణం కొనసాగించిన తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నార.

ఇక క్రిష్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అనుష్క శెట్టితో గాతి అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో హరిహర వీరమల్లు పార్ట్ 1కు ఆయన దర్వకత్వం వహించారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ప్రముఖ బ్యానర్‌లో ఆయన ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X