Klin Kaara First Photo: మెగా ప్రినెస్స్ క్లింకార ఫస్ట్ ఫోటో ట్రెండింగ్.. మెగా తాత చిరంజీవితో క్యూట్‌గా!

మెగా ప్రిన్స్ క్లింకార... పుట్టి రెండేళ్లు దగ్గర కావొస్తోంది. కానీ ఇప్పటికీ అభిమానులకు మెగా మనవరాలిని చూపించలేదు. 2023 జూన్ 20న క్లింకార జన్మించింది. చిన్నారి జన్మించిన రోజు అభిమానులు పెద్ద ఎత్తున పండగలే జరిపారు. క్లింకార పుట్టగానే మెగా ఇంట పట్టలేని సంతోషం కనబడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనల మొదటి బిడ్డగా, మెగా వారసురాలిగా క్లింకార జన్మించడం విశేషం. అయితే క్లింకారను ముద్దుగా మెగా ప్రినెన్స్ అని కూడా పిలుచుకుంటున్నారు. ఇక చిన్నారిని చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ తల్లిదండ్రులైన రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల కూడా ఎప్పుడూ చూపించడం లేదు.

ఎన్నో ఫంక్షన్లకు మెగా ఫ్యామిలీ చిన్నారి క్లింకారతో వెళ్లి వస్తున్నా మొహం కనిపించకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. రామ్ చరణ్ కూడా తన కూతురి మొహాన్ని బయటికి చూపించకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. అభిమానుల్లో ఇంకా ఆసక్తిని పెంచేలా కూతురి ఫేస్ కనిపించకుండా ఫొటోలకు స్టిల్స్ ఇచ్చి పోస్ట్ చేసేవారు కూడానూ. రీసెంట్ గానే రామ్ చరణ్ క్లింకారను ఆర్సీ16 సెట్స్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఫేస్ చూపించలేదు. ఇక ఎట్టకేళలకు క్లింకార ఫస్ట్ ఫొటో విడులైంది. తాత పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారి ఒడిలో చక్కగా కూర్చొని ఫొటోకు క్యాండిడ్ స్టిల్ ఇచ్చింది. ఎంతో చక్కటి రూపసౌందర్యంతో మెగా ప్రిన్సెస్ ఆకట్టుకుంటోంది. తన అమాయకపు చూపులు, పాలనూరగల్లాంటి బుగ్గలతో చిన్నారి మెగా ప్రిన్సెన్స్ ఆకట్టుకుంటోంది.

First Photo of Klin Kaara Konidela with Chiranjeevi trending in Social media

మెగా మనవరాలిగా, వారసురాలిగా క్లింకార ఇప్పటికే ఎంత క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. ఈ స్టార్ కిడ్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరో రామచరణ్ కూతురు ఫొటో మొదటిసారిగా బయటకి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చిన్నారి ఫొటోను మరింతగా వైరల్ చేస్తున్నారు.

తమ ప్రిన్సెన్స్ ఫస్ట్ ఫొటో అంటూ షేర్ చేస్తున్నారు. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల గురించి లీక్స్ ఇచ్చినట్టే.. తన మనవరాలి ఫస్ట్ ఫొటోను కూడా ఇలా అభిమానులకు అందించారు. ఏదేమైనా రెండేళ్లుగా ఫ్యాన్స్ అడుగుతుండా.. ఇప్పటికీ అయితే క్లింకార ఫొటో రివీలైంది. చిన్నారి ఎంతో చక్కటి రూపంతో, ఆకట్టుకునే చూపులతో మెగా ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటోంది.

First Photo of Klin Kaara Konidela with Chiranjeevi trending in Social media

ఇక మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కలిసి ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్నారు. క్లింకారను కూడా తమ వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే క్లింకార ఫస్ట్ ఫొటో బయటికి వచ్చింది. ఎంతో చక్కగా అటు తండ్రి, ఇటు తాత ఒడిలో కూర్చొని ఉన్న క్లింకార ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఇక క్లింకార అనే ప్రత్యేక పేరు అర్థం కూడా తెలుసుకుందాం.. ప్రపంచం మొత్తానికి శక్తిని ప్రసాదించే అమ్మవారి సహస్రనామాల్లో క్లిన్ కారా ఒకటి. అమ్మవారి అసమాన శక్తికి ఈ పదం అద్దం పడుతుంది. అపారమైన శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుందనడానికి నిదర్శనంగా లలిత సహస్ర నామాల్లో క్లిన్ కారా అనే పేరును ఉపయోగిస్తారు. అంతటి గొప్ప పేరును మోగా ప్రినెన్స్ కు నామకరణం చేయడం విశేషం.

More from Filmibeat

Read more about: klin kaara klin kaara konidela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X