Varun Tej నిశ్చితార్థం ఫోటోలు వైరల్.. వరుణ్ గుండెపై చేయి వేసి.. ఎంగేజ్‌మెంట్ ఎక్కడ? ఎవరెవరు వచ్చారంటే?

మెగా ఫ్యామిలీ ఇంటిలో నిశ్చితార్థం వేడుక నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబాల ఆశీస్సుల మధ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ వేడుక ఆహ్లాదకరంగా ముగిసింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి చేతికి వరుణ్ తేజ్ ఉంగరాన్ని తొడిగారు. ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం వేడుక జూన్ 9వ తేది సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. తొలుత వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరుగుతుందనే ప్రచారం మీడియాలో జరిగింది. అయితే అందుకు భిన్నంగా మణికొండలోని నాగబాబు ఇంటిలో అతికొద్ది మంది సమక్షంలో ప్రైవేట్ వేడుకగా జరిగింది.

Varun Tej engagement

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ వేడుకకు మెగా మదర్ అంజనాదేవి సమక్షంలో కుటుంబ సభ్యులు హాజరవ్వగా జరిగింది. నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ కొణిదెల, సుస్మిత్ కొణిదెల, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

లావణ్య త్రిపాఠి చేతికి ఉంగరం తొడిగిన తర్వాత వారిద్దరూ దండలు మార్చుకొన్నారు. అనంతరం చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కల్యాణ్ ఆశీస్సులు అందజేశారు. ఈ వేడుక ఆద్యంత హుషారుగా, ఆనందంగా, ఉత్తేజంగా జరిగింది. లావణ్య త్రిపాఠి కుటుంబానికి చెందిన కొందరు ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు.

Varun Tej engagement

లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుణ్ తేజ్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు పోస్టు చేశారు. నేను నా ప్రేమను పొందాను. ఆమె లావణ్య త్రిపాఠి అంటూ మెసేజ్ పోస్టు చేశారు. వరుణ్ తేజ్ పోస్టు పెట్టగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. నా జీవిత భాగస్వామి లభించాడు. అతనే వరుణ్ తేజ్ అంటూ లావణ్య త్రిపాఠి పోస్టు పెట్టింది. ఈ ఇద్దరి పోస్టులపై అభిమానులు శుభాకాంక్షలతో అభినందనలు వెల్లువెత్తించారు.

Varun Tej engagement

నిశ్చితార్థం జరిగిన వెంటనే లావణ్య పక్కనే కూర్చొని కెమెరాలకు వరుణ్ తేజ్ ఫోజిచ్చారు. ఆ తర్వాత వేలికి తొడిగిన ఉంగరాన్ని చూపిస్తూ వరుణ్ గుండెపై చేయి వేసి కెమెరాకు ఫోజిచ్చింది. ఆ తర్వాత లావణ్యను ప్రేమగా దగ్గరకు తీసుకోగా.. నవ్వుల్లో మునిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X