వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి ఫస్ట్ సింగిల్.. మరింత రొమాంటిక్‌గా విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్, టాలీవుడ్ సెన్సేషన్, యూత్ స్టార్ ఇలా ఏ పేరుతో పిలిచినా విజయ్ దేవరకొండ అనే అందరికీ అర్థమవుతుంది. అంతలా క్రేజ్ సంపాదించుకున్నాడీ యంగ్ హీరో. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. చివరగా డియర్ కామ్రేడ్ అంటూ ఎన్నో అంచనాల నడుమ వచ్చాడు అయితే ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు.
ఈ సారి మాత్రం హిట్ కొట్టడం పక్కా అని తెలుస్తోంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేశాయి. మళ్లీ విజయ్ దేవరకొండ తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్దమయ్యాడనే హింట్ ఇచ్చారు మేకర్స్.

తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి మరో అప్‌డేట్‌ను వదిలారు నిర్మాతలు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను పెంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేయబోతోన్నట్లు ప్రకటించారు. సోమవారం (జనవరి 20) సాయంత్రం 4.05గంటలకు రిలీజ్ చేయబోతోన్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. మై లవ్.. మొదటి పాట రాబోతోందని కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ పాట రొమాంటిక్ సాగబోతోన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇసబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
More from Filmibeat
vijay devarakonda world famous lover raashi khanna aishwarya rajesh catherine tresa isabella విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ రాశీ ఖన్నా ఐశ్వర్యా రాజేశ్ క్యాథరిన్ ఇసబెల్లా


Click it and Unblock the Notifications











