చరిత్రలో మొదటిసారి .. ఈ థియేటర్స్ లో "పుష్ప 2" నిలిపివేత.. పంతానికి పోయి నష్టాలు
ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ రేంజ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించించిన భారీ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2 ది రూల్". దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డితో అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత చేసిన సీక్వెల్ ఇది . కాగా ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్ కి ఈ చిత్రం వచ్చింది. ఇదంతా బాగానే ఉంది.
ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పుష్పరాజ్ హవా ఊహించని లెవెల్లో మొదలైంది. గతంలో పుష్ప 1కి జరిగినట్టుగానే ఇంకా చెప్పాలంటే అంతకు మించిన సవాళ్ళే ఎదురయ్యాయని చెప్పవచ్చు. సినిమా కంటెంట్ డెలివరీ నుంచి ఇతర భాషల్లో షోస్ ఆపేయడం, పర్మిషన్స్స్ లేకుండా వేస్తున్నారని బుక్ చేసిన టికెట్స్ కూడా ఆపడం వంటివి. ఇంకా పలు పర్సనల్ ప్రొఫిషినల్ గొడవలు చిత్ర యూనిట్‌లోనే ఒకరికి ఒకరికి పడకపోవడం ఇలా చాలానే తతంగం నడిచింది.

ఇక ఇవి మినహా సినిమా టికెట్ ధరలు దీనిని మరింత క్రేజీ అంశంగా మారింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఏ భారీ సినిమా కూడా తీసుకోని స్టెప్‌ని ఒకరోజు ముందే రాత్రి సినిమాని రిలీజ్ చేసి సెన్సేషన్ సెట్ చేశారు. దీనితో ఈ టికెట్స్‌కి పెట్టిన ధరల పట్ల చాలా హంగామా నడిచింది. కాగా ఇవి కాకుండా కొద్దిరోజుల పాటుగా పుష్ప 2కి తెలంగాణ సహా ఏపీలో భారీ హైక్స్‌ని మేకర్స్ తెచ్చుకోవడం జరిగింది.
కానీ ఇదే ఇపుడు పుష్ప 2 లాంటి సినిమాకి ఒక బ్యాడ్ మార్క్ తెచ్చిపెట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ చాలానే ఉంటాయి. కానీ ఎన్నో దశాబ్దాల పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమోషన్ లా ఉన్న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ విషయంలో జరిగిన పరిణామం మాత్రం ఇపుడు చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పాలి. జనరల్‌గా హైదరాబాద్ మహానగరం విషయానికి వస్తే..
అప్పట్లో సినిమా అంటే గుర్తొచ్చే మల్టీప్లెక్స్ ఇదే. ఎన్నో సినిమాల్లో కూడా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ని చూపించారు. ఇందులో ఏ కొత్త సినిమా అయినా ఖచ్చితంగా చూడాల్సిందే అని అనుకుంటారు. అలాగే తెలుగు స్టేట్స్ లో దాదాపు మొదటి షో మల్టీప్లెక్స్ లలో కేటగిరీలో మొదటి షో అందులో పడాల్సిందే. అలాంటిది ఇక్కడ పుష్ప 2ని విట్నెస్ చేయాల్సిందే అని ఆడియెన్స్ అనుకున్నారు.
కానీ యాజమాన్యానికి, చిత్ర యూనిట్‌కి డీలింగ్స్, షేరింగ్ విషయంలో ఏదీ తేలకపోవడంతో ఆఖరికి సినిమానే వేయకుండా ఆపేసిన పరిస్థితి ఏర్పడింది. దీనితో చివరి నిమిషం వరకు పుష్ప 2 ఈ థియేటర్స్ లో పడుతుంది అనుకున్న నేపథ్యంలో ఫైనల్ గా సినిమా విడుదలే ఆగిపోయింది అని వారు కన్ఫర్మ్ చేశారు. పుష్ప 2 సినిమా తమ థియేటర్స్ లో వేయడం లేదని షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. దీనితో ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఓ సినిమా అది కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదల కాకుండా నిలిపివేయడం అనేది ఒక చారిత్రిక అంశంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications











