షిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. కమెడియన్‌కు అండగా ప్రభాస్, చిరంజీవి!
తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ యాస, భాషతో తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో హాస్యాన్ని పండించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థోమత గురించి వన్ ఇండియా రిపోర్టర్ శ్రీనివాస్ చక్కిళ్ల వాకబు చేశారు. ఈ సందర్భంగా ఫిష్ వెంకట్ భార్య, కూతురు స్రవంతి చెప్పిన విషయాల్లోకి వెళితే..
నాన్న గారి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఐసీయూలో చికిత్స జరుగుతున్నది. కిడ్నీ పాడైపోయింది. తప్పనిసరి ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారు. ఆ చికిత్స కోసం 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. సినిమా పరిశ్రమ నుంచి ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కానీ కిడ్నీ దాత ఎవరూ కూడా దొరకడం లేదు. దాత కోసం వెతుకుతున్నాం అని కూతురు స్రవంతి తెలిపారు.

మాకు 50 లక్షలు ఖర్చు చేసే స్తోమత లేదు. సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా సహాయం చేస్తారా? అని ఎదురు చూస్తున్నాం. మా నాన్నకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఏర్పాట్లు చేయమని కోరుతున్నాం. ఎవరైనా దొరికితే ఆ చికిత్స పూర్తయ్యేలా చూడమని చెబుతున్నాం. మా కుటుంబ సభ్యులదెవరిది మ్యాచ్ కాలేదు. మా డాడీ వాళ్ల బ్రదర్స్ గ్రూప్ మ్యాచ్ అవుతుంది. కానీ వారికి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని స్రవంతి చెప్పారు.
ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. రెండు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతాయని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి టీమ్ నుంచి ఫోన్ వచ్చింది. అయితే ఆ లోపే చెన్నై నుంచి ఓ ఫ్రెండ్ వచ్చి నేను ఎంత ఖర్చైనా చేయిస్తానని చెప్పాడు. దాంతో ఎవరి సహాయం కొరలేదు. ఆ ఫ్రెండ్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తున్నది. గత పది రోజుల నుంచి వెంకట్ లేవడం లేదు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మాట కూడా రావడం లేదు అని భార్య కన్నీటి పర్యంతమైంది.
సినిమా పరిశ్రమ నుంచి హీరోలు కానీ, ప్రభుత్వం గానీ సహాయం చేస్తారా? అని ఎదురు చూస్తున్నాం. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం హాస్పిటల్ చేర్పించాం. కిడ్నీ మార్పిడి చేస్తేనే గానీ ఆయన కోలుకోరని చెప్పారు. దాంతో ఎవరైనా దాత దొరుకుతారా? అని ఎదురు చూస్తున్నామని భార్య ఆవేదన చెందారు.
షిఫ్ వెంకట్ కెరీర్ విషయానికి వస్తే.. సమ్మక్క సారక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆది చిత్రంలో చిన్నా తొడగొట్టరా? అంటూ చెప్పిన డైలాగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నారు. కామెడీ టచ్ ఉన్న విలనిజంతో తనదైన ముద్ర వేసుకొన్నారు. తన కెరీర్‌లో దాదాపు 100 సినిమాలకుపైగా నటించారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్ లో నటించారు.


Click it and Unblock the Notifications











