ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. సహాయానికి స్టార్ హీరోలు దూరం ఎందుకంటే?

టాలీవుడ్ కమెడియన్ ఫిష్ వెంకట్‌ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా రెండు కిడ్నీలు పాడైపోవడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరగా.. ఇప్పటికే వెంకట్ కుటుంబం ఉన్నదంతా ఖర్చు చేసి ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటోంది. తమ పరిస్థితిని వివరించి సాయం చేయాలని సినీ ప్రముఖులను ఫిష్ వెంకట్ కుటుంబం అభ్యర్ధించింది. కొందరు సాయం చేస్తున్నప్పటికీ.. పెద్ద హీరోల నుంచి ఈ కుటుంబానికి సాయం అందకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై సీనియర్ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

దారుణంగా కమెడియన్ల జీవితాలు
తెరపై తమ హాస్యంతో ప్రేక్షకుల్ని నవ్వించే కమెడియన్లు నిజ జీవితంలో మాత్రం దుర్భర పరిస్ధితులు ఎదుర్కొన్నారు. ఎంతో వైభవంగా బతికిన ఎంతోమంది నటులు చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, అనారోగ్యంతో నానాబాధలు పడ్డారు. ఇక ఫిష్ వెంకట్ విషయానికి వస్తే సమ్మక్క- సారక్క సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి సినిమాలలో నటించారు. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్‌తో ఫిష్ వెంకట్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తడంతో బాగా బిజీ అయ్యారు వెంకట్.

Fish Venkat Health Tammareddy Bharadwaja gave clarity on why big stars not helping

సినిమాలకు దూరంగా ఫిష్ వెంకట్
గత కొన్నాళ్లుగా ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పాడవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. గతేడాది ఓ యూట్యూబ్ ఛానెల్‌లో తన కష్టాలను, పడుతున్న బాధలను తెలియజేశారు. షుగర్ కారణంగా కాలిని తీసివేసి పరిస్ధితి వచ్చిందని, డబ్బులు లేక గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నానని ఫిష్ వెంకట్ తెలిపారు. ఆయన పరిస్ధితి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు అప్పట్లోనే స్పందించి సాయం చేశారు.

మంచానికే పరిమితం
అయితే రాను రాను ఫిష్ వెంకట్ అనారోగ్యం మరింత ఎక్కువై, ఇటీవల పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఫిష్ వెంకట్ పరిస్ధితి తెలిసి పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ స్పందించారని.. తన టీమ్ ద్వారా సాయం చేశారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అని, తమకు ప్రభాస్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఫిష్ వెంకట్ ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం దీనిపై స్పందించారు. పెద్ద మనసుతో ఫిష్ వెంకట్‌కు 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణ మంత్రులు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. అయితే నానాటికీ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్ధితి మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫిష్ వెంకట్‌కు అందని సాయం
సాధారణంగా సినీ పరిశ్రమకు చెందిన హీరోలు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆగమేఘాల మీద స్పందించే పెద్ద హీరోలు.. సినీ పరిశ్రమకే చెందిన నటుడు కష్టాల్లో ఉండటంతో ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీనిపై నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఎవరి కోసం ఎవరూ రారని, మన భవిష్యత్ కోసం మనమే ఆలోచించుకోవాలని సూచించారు. సంపాదించే ప్రతి రూపాయిలో పావలా దాచుకోవాలని.. రూపాయి సంపాదించి, రూపాయిని ఖర్చు చేస్తే ఎలా అని భరద్వాజ ప్రశ్నించారు.

పెద్ద హీరోలు బిజీ
ఒకప్పుడు సినీ పరిశ్రమలో నిర్మాత నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లమని.. ప్రొడ్యూసర్‌కి కష్టం వస్తే ప్రొడక్షన్ బాయ్ కూడా ఆదుకున్న రోజులు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఎవరి దారి వాళ్లదే.. పారితోషికాలు పెరిగిపోయాయని, పెద్ద హీరోలు బయటకు రారని తమ్మారెడ్డి చెప్పారు. హెల్త్, ఎడ్యుకేషన్ ఈ దేశంలో ఫ్రీగా దొరకాలని.. ఈ రెండు ప్రైవేట్ పరం కావడం వల్లే ప్రభుత్వాల బడ్జెట్ పెరిగిపోయిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఫ్రీగా చికిత్స దొరికితే అడుక్కునే పరిస్ధితి ఉండదని భరద్వాజ వెల్లడించారు. ఫిష్ వెంకట్ ప్రభుత్వానికి ఎంతో ట్యాక్స్ కట్టి ఉంటాడని, మరి ఇప్పుడు ఆయన పరిస్ధితి బాగోనప్పుడు సాయం చేయాల్సిన పరిస్ధితి ప్రభుత్వానిదేనని తెలిపారు.

మా నుంచి సాయం కొంతే
ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాలలో నటించారు.. ఆయనను మానవత్వంతో ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తమ్మారెడ్డి అన్నారు. మా నుంచి పూర్తి సాయం అందే అవకాశం ఇవ్వలేదని దానికి బడ్జెట్ కొంతమేర మాత్రమే ఉంటుందని తమ్మారెడ్డి అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఇన్సూరెన్స్ సౌకర్యం లేదని, కొన్ని హెల్త్ చెకప్‌లకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X