ఐదుగురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్.. మైండ్ బ్లోయింగ్ గా అట్లీ ప్లానింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభంకాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం స్టార్ కాస్ట్ ను, హీరోయిన్లను ఎంపిక చేసే పనిలో టీమ్ నిమగ్నమైంది. ఈ సందర్భంగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ అందుతున్నాయి. ఇక అల్లు అర్జున్ 'పుష్ప2'తో చివరిగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా సత్తాను చాటారు. ఆడియెన్స్ ను మెప్పించడమే కాకుండా... బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించారు. రూ.1870 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి ఇండియాస్ సెకండ్ హ్యయేస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

పుష్ప2 సెన్సేషన్ తర్వాత అల్లు అర్జున్ రాబోయే చిత్రాలపై మరింత ఆసక్తి పెడుతున్నారు. పుష్ప2తోనే బాక్సాఫీస్ వద్ద రూ.2 వేల కోట్లు కొల్లగొట్టాలని ప్రయత్నించిన బన్నీ బాయ్ కి కొంచెంలో టార్గెట్ మిస్ అయ్యింది. మరోవైపు పరిస్థితులు కూడా సరిగా అనుకూలించలేదు. కాగా.. అప్ కమింగ్ ఫిల్మ్స్ తో ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ తో అనుకున్నప్పటకీ... ఉన్నట్టుండి తమిళ దర్శకుడు అట్లీ లైన్ లోకి వచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ - అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

Five Heroines for Allu Arjun Atlee Upcoming film Here is interesting details

కాగా, అల్లు అర్జున్ - అట్లీ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ 'పుష్ప2'తో రూ.1870 కోట్లు కలెక్ట్ చేయడం, అట్లీ 'జవాన్'తో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబటంతో.... వీరి కాంబోలో వచ్చే ప్రాజెక్ట్ మరింత సాలిడ్ గా ఉంటుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యాక్టివ్ విషయంలో, ఛాలెంజింగ్ రోల్స్ లో నటించేందుకు అల్లు అర్జున్ ఎంతలా కష్టపడుతారో తెలిసిందే. దీంతో అట్లీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో బన్నీని మునుపెన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి అందింది. ఈ చిత్రంతో ఏకంగా ఐదుగురు హీరోయిన్లను ఎంపిక చేశారంట అట్లీ.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ, 'దేవర' హీరోయిన్ జాన్వీ కపూర్ ను మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ చేశారంట. అమెరికా, కొరియన్ నుంచి మిగితా హీరోయిన్లను ఎంపిక చేయబోతున్నారంట. దీనికి సంబంధించిన టాక్స్ శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ఫారేన్ స్పెషల్ ట్రైయినింగ్ ను కూడా కంప్లీ చేసుకుని షూట్ కు సిద్ధమయ్యారంట.

Five Heroines for Allu Arjun Atlee Upcoming film Here is interesting details

త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు అట్లీ పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. కేవలం 8 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయబోతున్నామని ఇప్పటికే హామీనిచ్చినట్టు తెలుస్తోంది. అట్లీ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నాలుగోసారి మేజిక్ చేయబోతున్నారు బన్నీ. ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా 2026కు ఈ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X