twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    November 4th Movies: చిన్న సినిమాల బాక్సాఫీస్ యుద్ధం.. అందరి ఆరాటం హిట్టు కోసమే..

    |

    బాక్సాఫీస్ వద్ద దీపావళి సందర్భంగా వచ్చిన తెలుగు సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. కానీ తమిళ డబ్ మూవీ సర్దార్ మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంటుంది. దానికి తోడు కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార కూడా పరవాలేదు అనే విధంగా కలెక్షన్స్ రాపడుతోంది. ఇక నవంబర్ 4వ తేదీన ఒకేసారి ఐదు సినిమాలు రాబోతున్నాయి. ఇక ఆ టైంలో రాబోతున్న హీరోలు అందరికీ కూడా ఒక బలమైన సక్సెస్ అయితే కావాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..

    ఊర్వశివో రాక్షసివో

    ఊర్వశివో రాక్షసివో

    నవంబర్ 4వ తేదీన అందరికంటే ముందుగానే రిలీజ్ డేట్ ను ప్రకటించిన వారిలో అల్లు శిరీష్ ఉన్నాడు. ఈ అల్లు హీరో చాలాకాలంగా బాక్సాఫీస్ వద్ద ఒక గ్రాండ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసారి ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి గుర్తింపు అందుకుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటించింది.

    లైక్ షేర్ సబ్ స్క్రైబ్

    లైక్ షేర్ సబ్ స్క్రైబ్

    అలాగే అక్టోబర్ 4వ తేదీన మరొక యువ హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వర్షం డైరెక్టర్ తనయుడు సంతోష్ శోభన్ నటించిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా కథానాయక నటించింది. డిఫరెంట్ డ్రామాగా రానున్న ఈ సినిమాతో శోభన్ బాక్సాఫీస్ వద్ద మొదటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాడు.

     ఆకాశం

    ఆకాశం

    ఇక అదే రోజు ఆకాశం అనే మరొక డిఫరెంట్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అశోక్ సెల్వా కథానాయకుడుగా నటించగా రీతూ వర్మ కథానాయకగా నటించింది. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో శివాత్మిక రాజశేఖర్ నటించింది. ఈ ముగ్గురికి కూడా బాక్సాఫీస్ వద్ద ఒక సక్సెస్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ క్లాష్ లో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

    మరో కన్నడ సినిమా బనారస్

    మరో కన్నడ సినిమా బనారస్

    ఇక అక్టోబర్ 4వ తేదీన బనారస్ అనే మరొక కన్నడ సినిమా రాబోతోంది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్పెషల్ పోస్టర్స్ బాగా కట్టుకున్నాయి. జైద్ ఖాన్, సొనల్ మోంటెరియో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇక విడుదలైన టీజర్ సాంగ్స్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కాంతర సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా ఆ రేంజ్ లో సక్సెల్ కాకపోయినా ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు.

    బొమ్మ బ్లాక్ బాస్టర్

    బొమ్మ బ్లాక్ బాస్టర్

    ఇక బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమా ద్వారా ఈసారి సక్సెస్ అందుకోవాలని హీరో నందు ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాలో యాంకర్ రష్మీ కథానాయకగా నటించడం విశేషం. హీరోగా నందు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలని అనుకుంటున్నాడు. అలాగే యాంకర్ రష్మీ కూడా చాలా సినిమాలు చేస్తుంది కానీ వెండితెరపై బ్రేక్ ఇచ్చి క్యారెక్టర్ ఏమి ఆమెకు రాలేదు. అందుకే ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నారు. మరి ఈ బాక్స్ ఆఫీస్ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

    English summary
    Five upcoming telugu movies on November 4th release details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X