Sarkaru Vaari Paata: బడా సంస్థల చేతికి మహేశ్ మూవీ.. రికార్డులు బ్రేకయ్యే ప్లాన్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. పెద్ద బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తన టాలెంట్లను నిరూపించుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. హిట్లు ఫ్లాపులను బేరీజు వేయకుండా దూసుకెళ్తోన్న మహేశ్.. తన మార్కెట్‌ను కూడా భారీగానే పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో అతడు వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ జోష్‌తోనే వరుస పెట్టి సినిమాలు లైన్‌లో పెడుతున్నాడు.

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ హిట్లతో యమ ఉత్సాహంతో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ ఈ మూవీ రూపొందుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాను కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

వాస్తవానికి 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడింది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌ను మాత్రం గత ఏడాది జనవరిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఆ మధ్య ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా షూట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపుగా పూర్తైందని అంటున్నారు. అంతేకాదు, మహేశ్ బాబు కూడా తన పార్ట్ షూట్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

Fly High Cinemas and Shloka Entertainments Bagged Sarkaru Vaari Paata Rights

క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే చాలా ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూఎస్ రిలీజ్ హక్కులను ఫ్లై హై సినిమాస్, శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు భారీ ధరకు సొంతం చేసుకున్నాయని తెలిసింది. అంతేకాదు, మే 11వ తేదీన యూఎస్‌లో ప్రీమియర్స్‌ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేశారని సమాచారం. ఇదే జరిగితే అక్కడ ఓపెనింగ్ కూడా అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X