twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుల్వామా అమరవీరుల కుటుంబాలకు FNCC 4 లక్షల విరాళం

    |

    జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ FNCC (ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) ముందుకొచ్చింది. రూ. 4, 82, 000 సహాయాన్ని ప్రకటించింది. అసోసియేషన్‌లో ఒక సభ్యుడైన భాసిరెడ్డి నాగఅన్వేష్ తనవంతు సాయంగా లక్ష రూపాయలు అందించారు. రెండు మొత్తాలకు సంబంధించిన చెక్కులను అసోసియేషన్ సభ్యులు సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అందచేశారు.

    FNCC నుంచి చెక్కులు అందుకున్న సీఆర్పీఎఫ్ కార్యాలయ అధికారి ఐపీఎస్ శ్రీకే దుర్గాప్రసాద్ (మాజీ డీజీపీ), సదరన్ సెక్టార్ ఐజీపీ జీహెచ్‌పీ రాజు FNCC సభ్యులను అభినందించారు. ఇలాంటి ప్రోత్సాహకాల వల్ల జవాన్ల మనోధైర్యం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా ఐజీపీ జీహెచ్‌పీ రాజు తెలిపారు. ఈ మొత్తాన్ని భారత్ వీర్ అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు.

    FNCC donated Rs.4 Lakhs to Pulwama Attack victims

    సీఆర్పీఎఫ్ అధికారులను కలిసి చెక్కులు అందజేసిన వారిలో ఎఫ్ఎన్‌సీసీ సెక్రెటరీ బి. రాజశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యులు శ్రీమతి శైలజ జుజాల, పి. రామకిశోర్, కే సదాశివరెడ్డి, వీవీఎస్ఎస్ పెద్దిరాజు, సురేష్ కొండేటి ఉన్నారు.

    English summary
    Film Nagar Cultural Centre (FNCC) donated Rs.4 Lakhs to Pulwama Attack victim family. FNCC representative hand overed the Check to CRPF office. CRPF official appreciated the FNCC Members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X