Gaddar Songs: గద్దర్‌కు ఆ పేరు ఎలా వచ్చింది? ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టిన పాటలేంటో తెలుసా?
ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఈరోజు ఆగస్టు 6న కన్నుమూశారు. ఇక తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆయన పాటలకు అంత స్పెషల్ ఏంటీ.. గద్దర్ కు నంది అవార్డులు తెచ్చిపెట్టిన పాటలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా గాయకుడు గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ.. అలరించేవారు. ఇక ఆయన ఈరోజు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల గద్దర్ కు గుండెపోటు రావడంతో... అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరారు. ఇక ఆయనను పలువురు ప్రముఖులు సైతం పరామర్శించారు. అందులో పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఇక ఈరోజు గద్దర్ చికిత్స పొందుతూ.. ఆరోగ్యం విషమించడంతో మరణించారు.

గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన 1949లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ యాక్టివ్ గా పాల్గొన్న గద్దర్... ఊరురా తిరిగి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథ ప్రదర్శన ఎంచుకున్నారు గద్దర్.
1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అనే పాటను (మొదటి పాట ) రాశారు. ఆయన రాసిన మొదటి ఆల్బం పేరు గద్దర్ అని పెట్టారు. అనంతరం ఆ పేరే ఆయన పేరుగా స్థిరపడింది. 1975లో గద్దర్ బ్యాంక్ రిక్రూట్ మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు(మరణించారు), వెన్నెల ఉన్నారు.

ఇక గద్దర్ మృతితో.. యావత్ తెలంగాణ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కాగా గద్దత్ ఉద్యమ సమయంలో ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. అందులో గద్దర్ రాసి పాడిన అమ్మ తెలంగాణమా అనే పాటకు మంచి ఆదరణ వచ్చింది. ఈ పాట తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగుతుంది. కాగా ఈ పాట లేకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేదు అనడంలో అతిశయోక్తి లేదు.
అలాగే నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. కానీ గద్దర్ ఆ అవార్డును తిరస్కరించారు. మరోసారి జై బోలో తెలంగాణ సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దు' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట కూడా అద్భుత విజయం సాధించింది. అలాగే "అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా" అనే పాటను "తెలంగాణా" రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది.


Click it and Unblock the Notifications











