For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్‌లోకి పారిశ్రామికవేత్త కొవ్వూరి సురేష్ రెడ్డి.. ఒకేసారి మూడు చిత్రాలతో సంచలనం

  |

  ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన కొవ్వూరి సురేష్ రెడ్డి సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ఆరంభంలోనే సంచలన నిర్ణయం తీసుకొంటూ కేవలం ఒకే సినిమానే కాకుండా మూడు సినిమాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 20 చిత్రాలను నిర్మించనున్నట్టు బృహత్ ప్రణాళికను మీడియా ముందుకు తీసుకొచ్చారు. పీ19 ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై రాబోయే భారీ, చిన్న చిత్రాలను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌‌లో బ్యానర్, ప్రొడక్షన్ కంపెనీకి సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రసాద్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ బాబు, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ దశరాథరామిరెడ్డి, ప్రముఖ నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్, రాజు మదిరాజు, ప్రదీప్ మద్దాలి, అకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

  పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రొడక్షన్‌ నెం1గా రూపొందనున్న చిత్రానికి ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. గతంలో సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌, పేపర్‌ బోయ్‌ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఆకాశ్ రెడ్డికి ఉంది. ఛోరి, 'మరోజన్మ', 'ప్యూర్‌ సోల్‌' వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ ఆకాష్‌రెడ్డి రూపొందించారు.

  Forbes entrepreneur, Popular Industrialist Kovvuri Suresh Reddy entered into Film production

  పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రొడక్షన్‌ నెం2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా 'ఋషి'కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ఋషి చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఆంధ్రాపోరి, ఐతే 2.0 చిత్రాలకు రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు.

  Forbes entrepreneur, Popular Industrialist Kovvuri Suresh Reddy entered into Film production

  పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రొడక్షన్‌ నెం3గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు 'పెళ్ళి గోల' వెబ్‌ సిరీస్‌, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన '47 డేస్‌' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. దీనికి రమేష్‌ ప్రసాద్‌గారు సమర్పకులు.

  పారిశ్రామికవేత్త కొవ్వూరి సురేష్‌రెడ్డి విషయానికి వస్తే.. యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఆయన పేరు సుపరిచితం. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్‌ ఇటీవల 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తిగా సురేష్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. గత 13 ఏళ్ళుగా 'క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ' మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అటువంటి సురేష్‌రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు.

  Forbes entrepreneur, Popular Industrialist Kovvuri Suresh Reddy entered into Film production

  సినిమా లోగోలు ఆవిష్కరించిన అనంతరం రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా నాన్న ఎల్వీ ప్రసాద్‌గారు. ఆయన సంపాదించినదంతా సినిమాల్లోనే పెట్టారు. మాకు హైదరాబాద్‌, చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ముంబై, కలకత్తాలో ఆఫీసులు ఉన్నాయి. నా జీవితమంతా సినిమాతో ముడిపడి ఉంది. మేం ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో కొన్ని సినిమాలు నిర్మించాం. ఇంకా నిర్మిస్తాం. మేం చిత్రనిర్మాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ రోజు మూడు చిత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది అని అన్నారు.

  దిల్‌' రాజు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రపంచం మొత్తం కుదేల్ అవుతుంటే... మా రమేష్‌ ప్రసాద్‌గారు మళ్ళీ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఎనర్జీగా 84 ఏళ్ళ వయసులో మూడు సినిమాల ప్రొడక్షన్‌ మొదలుపెడుతూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఎల్వీ ప్రసాద్‌గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నందుకు థ్యాంక్స్‌ చెబుతున్నాను. చివరి శ్వాస వరకూ సినిమాతో ఉంటాని ఆయన చెప్పడం సినిమా రంగంపై డెడికేషన్‌కు సంకేతం అని అన్నారు.

  English summary
  Popular Industrialist Kovvuri Suresh Reddy entered into Film production. He has ventured into Tollywood with three films in the first slot. He plans to make 20 films, big and small, in 4 years on the newly-founded P19 Entertainment banner. On Friday, the first three films were announced.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X