క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రౌడీ భాయ్.. రోశయ్య చేతుల మీదుగా ఫస్ట్‌లుక్
భీమవరం టాకీస్ నుంచి వస్తున్న మరో సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా రౌడీ భాయ్. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కొణిజేటి రోశయ్య మాట్లాడుతూ.. నేను రామసత్యనారాయణ గారికి సినిమా పట్ల వున్న ప్రేమ. ఇప్పటివరకు దాదాపు వంద సినిమాలుకు చేరువకి తీసుకొచ్చింది అని అన్నారు.
డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు నిర్మిస్తూ కొత్త కొత్త నటీ నటులను, సాంకేతిక నిపుణులను సినీ పరిశ్రమకి పరిచయం చేస్తూనే వున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో ఇన్ని సినిమాలు నిర్మించిన ఆయన మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని, ఆయన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రోశయ్య అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. హీరో మానస్, షిప్రా కౌర్, స్మైల్ శ్రీను, సంగా.. మొదలగు వారు నటించిన ఈ చితం ఫస్ట్‌లుక్‌ను లాంఛనప్రాయంగా మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అతి త్వరలో నిర్మాణ అనంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నది అని చెప్పారు.
సంజాన డెవలపర్స్ జాన్ సమర్పణలో భీమవరం టాకీస్ నిర్మించిన ఈ రౌడీ భాయ్ చిత్రాని కి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. పీఆర్ఓ: మధు వీ.ఆర్, సంగీతం: అర్జున్, కెమెరా: భాస్కర్, దర్శకుడు: ఉదయ్. జి


Click it and Unblock the Notifications











