అల్లు అర్జున్‌కు చేదు అనుభవం.. భార్య స్నేహారెడ్డిని అభిమానులు చుట్టుముట్టి..

ఇటీవల కాలంలో సెలబ్రిటీలకు పబ్లిక్‌లో ప్రశాంతంగా క్షణాలు గడపడం గగనంగా మారుతోంది. హీరో లేదా హీరోయిన్ బయట కనిపిస్తే చాలు.. అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టి, సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ప్రేమ, అభిమానమే కారణమైనా, ఆ అతిశయోత్సాహం ఇప్పుడు భద్రతా సమస్యగా మారుతోంది. మొన్న హీరోయిన్ సమంత, నిన్న తమిళ స్టార్ విజయ్, అంతకుముందు నిధి అగర్వాల్... తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. అసలేం జరిగిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి తో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్ కు వెళ్లారు. నగరంలో తన కొత్త థియేటర్ 'అల్లు సినిమాస్' ఈవెంట్ పూర్తి చేసిన తర్వాత, టీ కోసం కేఫ్‌కు వచ్చిన ఈ స్టార్ దంపతులను చూసిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సెల్ఫీల కోసం చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. కేఫ్ నుంచి బయటకు వచ్చే సమయంలో అభిమానుల గుంపు బన్నీ దంపతులను పూర్తిగా చుట్టేసింది.

From Samantha to Allu Arjun Fan Overenthusiasm Turns Public Appearances into Chaos

సెల్ఫీలు, వీడియోల కోసం తోసుకుంటూ ముందుకు రావడంతో అల్లు అర్జున్ తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. భార్య స్నేహారెడ్డి చేయి గట్టిగా పట్టుకుని, జనాల మధ్య నుంచి దారి చేసుకుంటూ నడవాల్సి వచ్చింది. భారీ సంఖ్యలో అభిమానులు ఉండడంతో సెక్యూరిటీ సిబ్బందికీ జనాలను అదుపు చేయడం కష్టమైంది.చివరకు అతి కష్టం మీద భద్రతా బౌన్సర్లు ఇద్దరినీ కారువరకు తీసుకెళ్లారు. కారు దగ్గర కూడా అభిమానులు పక్కకు జరగకపోవడంతో, బన్నీ స్వయంగా 'పక్కకు జరగండి'అంటూ అభ్యర్థించాల్సి వచ్చింది.

స్నేహా రెడ్డి సురక్షితంగా కారులో కూర్చున్న తర్వాత, అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు అభిమానుల ప్రేమగా చూస్తే, మరికొందరు మాత్రం 'ఇది ప్రేమ కాదు ... అతిశయోత్సాహం', 'స్టార్ హీరో కూడా తన భార్యతో కేఫ్‌కు వెళ్లి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు' అంటూ విమర్శలు చేస్తున్నారు.

సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు. మొన్న సమంత, నిధి అగర్వాల్, విజయ్... ఇప్పుడు అల్లు అర్జున్. వరుస ఘటనలు చూస్తే అభిమానుల అతిశయోత్సాహం సెలబ్రిటీల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానాన్ని చూపడం తప్పు కాదు, కానీ హద్దులు దాటితే అదే అభిమాన హీరోలకు ఇబ్బందిగా మారుతుందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఇదే రోజున హైదరాబాద్ కోకాపేటలో అల్లు అర్జున్ తన కొత్త థియేటర్ అల్లు సినిమాస్ కోసం సాఫ్ట్ లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తన కుమారుడు అయాన్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఈ థియేటర్ డాల్బీ సినిమా ఫార్మాట్‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఆసియాలోనే టాప్ టెక్నాలజీ థియేటర్లలో ఒకటిగా నిలవనుందని సమాచారం. థియేటర్ లోపల అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్, మామ చిరంజీవి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X