బిగ్ బాస్ హౌస్‌లోకి ఎటకారం ఎంటర్.. పన్నెండో పార్టిసిపెంట్ గా
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటు నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో పన్నెండో పార్టిసిపెంట్ గా ఫన్ బకెట్ మహేష్ (మహేష్ విట్టా) అడుగు పెట్టారు. ఈయనను బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున.. మహేష్ విట్టా గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

ఫన్ బకెట్ మహేష్.. ఈయన అసలు పేరు మహేష్ విట్టా. ఎటకారం చేస్తూ ఫన్ వీడియోల ద్వారా యూ ట్యూబ్ ఫేమ్ అయ్యాడు మహేష్. లుంగీ కట్టుకొని డిఫరెంట్ లుక్ లో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పటి నుంచి తనకు ఫెయిల్యూర్స్ ఎక్కువని, అందుకే తనలో ధైర్యం కూడా ఎక్కువే అని నాగార్జునతో చెప్పాడు. మహేష్ విట్టాకు సాదరంగా స్వాగతం పలికారు తోటి పార్టిసిపెంట్స్.


Click it and Unblock the Notifications











