ఆ డైరెక్టర్‌తో సినిమా అంటేనే రిస్క్.. స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్..

ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన సినిమా ఫంకీ (Funky). ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఒకవైపు కొంతమంది ప్రేక్షకులు నవ్వులు పడ్డామని చెబుతుంటే, మరోవైపు కథలో ఫ్లో లేదని, ఎడిటింగ్ ప్యాచ్‌వర్క్‌లా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీం సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమయంలో నిర్మాత నాగ వంశీ తనదైన స్టైల్‌లో స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఫంకీ (Funky) సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్‌ నటించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. విడుదలకు ముందు ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ తెచ్చుకున్న 'ఫంకీ', రిలీజ్ అయిన తర్వాత మాత్రం మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో కొందరు 'కామెడీ పూర్తిగా పండలేదు', స్టోరీ చాలా లూజ్‌గా ఉంది'అంటూ కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు మాత్రం సిల్లీ హ్యూమర్ నచ్చింది, రెండు గంటలు టైమ్ పాస్ అయ్యింది అంటూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

Funky Movie Producer Naga Vamsi Says Working with Anudeep Is a Risk Amid Mixed Talk

ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ ప్రెస్‌మీట్ నిర్వహించగా, నిర్మాత నాగవంశీ (Naga Vamsi) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిక్స్డ్ టాక్‌పై స్పందించిన నాగవంశీ తనదైన స్టైల్‌లో ఓపెన్‌గా మాట్లాడారు. 'ఇది సిల్లీ కామెడీ సినిమా అని నేను మొదటి నుంచే చెప్పాను. సీన్ నుంచి సీన్‌కు ఫ్లో ఉండకపోవచ్చు అని ముందే క్లారిటీ ఇచ్చాం. రివ్యూయర్లకు నచ్చే సినిమా తీస్తున్నానని ఎప్పుడూ అనలేదు. థియేటర్‌కి నవ్వుకోవడానికి మాత్రమే రండి అని కూడా చెప్పాం. అయినా మీరు సైంటిస్టుల్లా కొత్తగా కనిపెట్టినట్టు మాట్లాడుతున్నారు. సినిమా బ్లాకులు బ్లాకులుగా తీశాం. గ్రామర్ ఉండదని కూడా ముందే చెప్పాను' అంటూ స్పష్టంగా తెలిపారు.

అంతేకాదు... 'నేను సాగర సంగమం లాంటి క్లాసిక్ తీసానని చెప్పానా? ఇది కామెడీ ఫిల్మ్... ఇది సిల్లీ సినిమా... ఇది అనుదీప్ మార్క్ కామెడీ. ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడమే మా లక్ష్యం' అని అన్నారు. మీ ధైర్యం ఏంటి అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, నాగవంశీ ఆసక్తికరంగా స్పందించారు. 'అనుదీప్ లాంటి డైరెక్టర్‌తో సినిమా అంటేనే రిస్క్. ఫలితం మనం అనుకున్నట్టు రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు హిట్ అవుతుంది... కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీ. ముందుగానే ఊహించా.. ఈ సినిమాకు కాస్త డివైడ్ టాక్ వస్తుందని. ఒక విషయం మాత్రం నిజం... రివ్యూయర్లకు నచ్చే సినిమా తీయాలనే ఉద్దేశంతో అస్సలు చేయలేదు. సినిమాకు కావాల్సిన గ్లామర్ ఇందులో లేదన్నది కూడా నాకు ముందే తెలుసు. అయినా ఇది పక్కా కామెడీ ఎంటర్టైనర్‌గా తీశాం' అని చెప్పారు.

మొదటి రోజు మిక్స్డ్ టాక్‌పై మాట్లాడుతూ, 'డిస్ట్రిబ్యూటర్లు కూడా కాల్ చేసి కామెడీ బాగుందని, సెకండ్ హాఫ్‌లో మదర్ ఎమోషన్ పండిందని చెప్పారు. మీ టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నవ్వుకోవడానికి థియేటర్‌కి రండి' అంటూ ప్రేక్షకులను ఆహ్వానించారు. నాగవంశీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే 'ఫంకీ' క్లాసిక్ సినిమా కాదు, కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సిల్లీ కామెడీ. అందుకే కథా ఫ్లో, గ్రామర్ వంటి అంశాలకన్నా ఎంటర్టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని ఆయన నేరుగా చెప్పారు. అయితే.. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: anudeep kv naga vamsi Funky
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X