టాలీవుడ్ కా నందు అంటూ బ్రహ్మాజీ సెల్ఫీ..మరీ అంత వెధవలా కనపడుతున్నానా అంటూ వెన్నెల కిషోర్ రిప్లై!

ఒకప్పుడు తెలుగులో చాలా మంది కమెడియన్స్ ఉండేవారు కానీ కాలక్రమేణా వారంతా కనుమరుగు అవుతున్నారు. అయితే నేటి తరం కమెడియన్స్ లో చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో టచ్ లో ఉంటూ అభిమానులను తమదైన సరదా పోస్టులతో అలరిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది బ్రహ్మాజీ గురించి.. ఏడాదికి దాదాపు 15 సినిమాల్లో కనిపించే ఆయన సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ అందరినీ అలరిస్తూ ఉంటారు.

ఈ రోజు ఆయన తన తోటి కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి ఒక సెల్ఫీ తీసుకోవడమే కాక దానిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. షేర్ చేస్తూ ఈరోజు టాలీవుడ్ కి చెందిన నందు సబ్ కా బంధునీ కలిసాను అంటూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇదే అని చెబుతూ ఒక కామెంట్ కూడా పోస్ట్ చేశాడు. ఇక ఆయన పోస్ట్ చేసిన ఫోటోకి వెన్నెల కిషోర్ కూడా ఆసక్తి కరమైన కామెంట్ పెట్టాడు. ఫ్యాన్ బాయ్ మూమెంటా అన్న సర్కాసమ్ లో కూడా ఆప్టిమిజం చూపిస్తున్నావు అంటూ సిగ్గు పడుతున్న బ్రహ్మానందం జిఫ్ ఒకదానిని షేర్ చేశారు. దీంతో బ్రహ్మాజీ టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ కదా అని అలా అన్నానని కామెంట్ చేశాడు.

funny conversation between actor brahmaji and vennela kishore

దీంతో మరో బ్రహ్మానందం జిఫ్ తో రిప్లై ఇచ్చిన వెన్నెల కిషోర్ నేను మరీ అంతలా వెధవలా కనపడుతున్నానా ? ఓ మాదిరిగా కూడా కనపడటం లేదా? అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు. ఇక నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు కూడా ఈ మధ్యకాలంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ పిట్టకధ అనే సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రాగా, ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక వెన్నెల కిషోర్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు.. అయితే ఈ సెల్ఫీ ఏ షూటింగ్ సందర్భంగా తీసుకున్నాడో తెలియదుగానీ వెన్నెల కిషోర్ మాత్రం పోలీస్ బట్టల్లో కనిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X