వివాదంలో సుడిగాలి సుధీర్.. డైరెక్టర్‌పై కేసు.. GOAT నిర్మాత సీరియస్

Sudigali Sudheer's G.O.A.T Controversy: యాంకర్ సుడిగాలి సుధీర్, హీరోయిన్ దివ్యభారతి జంటగా నటించిన సినిమా 'గోట్'(G.O.A.T). ఈ సినిమాలో మొట్ట రాజేంద్రన్, సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, పృథ్వీ, ఆడుకులం నరైన్, పమ్మి సాయి, చమ్మక్ చంద్ర, ఆనందరామరాజు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. అప్పుడప్పుడే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్‌కి హీరో సుధీర్ దూరంగా ఉండటం, డైరెక్టర్ పేరు లేకుండా సినిమాను విడుదల చేయబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగింది?

గోట్ మూవీ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కింది. వాస్తవానికి రెండున్నరేళ్ల కిత్రమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ, ఆ సమయంలోనే ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు. కానీ, దర్శకుడికి నిర్మాతలతో ఏర్పడిన విబేధాల కారణంగా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కానీ, మొత్తానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్ధం అయింది. అయితే.. డైరెక్టర్ పేరు లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రచారంలో భాగంగా.. ఇటీవల 'ఓడియమ్మ' అనే సాంగ్ ను కూడా లాంచ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా టీజర్ కు చేశారు. అయితే.. ఈవెంట్స్ ల్లో సుడిగాలి సుధీర్ కనిపించకపోవడం. సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడంపై నిర్మాత చంద్రశేఖర్ స్పందించారు.

Sudigali Sudheer s G O A T Controversy

'గోట్' సినిమా చుట్టూ నెలకొన్న వివాదంపై నిర్మాత చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. సుధీర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆయన సపోర్ట్ చేయడంలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నిర్మాత చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. 'సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ వ్యక్తి. అందుకే అతడిని హీరోగా ఒప్పుకున్నాను. కింది స్థాయిలో నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతడికి ఎప్పుడూ లేనంత పెద్ద బడ్జెట్ ఈ సినిమాకి పెట్టాం. ఆయన సినిమాకి న్యాయం చేస్తాడని భావించాం. ఆయన ఫ్యామిలీ, తల్లిదండ్రులు చాలా మంచోళ్లు. అందుకే మంచి కుటుంబం నుంచి వచ్చారు. అతను న్యాయంగా చేస్తాడని నేను నమ్మాను" అని చెప్పారు.

షూటింగ్ సమయంలో కొన్ని సమస్యలు వచ్చిన కారణంగా పని కొంతకాలం నిలిచిపోయిందని ఆయన వివరించారు. " సినిమాను మధ్యలో ఆపాల్సి వచ్చింది. కొన్ని అంశాలను సరిచేయడానికి సమయం పట్టింది. ప్రస్తుతం ఛాంబర్‌లో ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను ఏ నిర్ణయానికి రాలేను. ఆ విషయాన్ని బయట పెట్టలేను. వివరాలు బయట పెట్టడం కూడా ఇప్పుడు సరైంది కాదు" అని అన్నారు.

డైరెక్టర్ గురించి మాట్లాడుతూ చంద్రశేఖర్ మరింత స్పష్టంగా మాట్లాడారు. 'హీరో కూడా ఆ డైరెక్టర్, టీం విషయంలో కొంత అసౌకర్యంగా ఫీలయ్యాడు. అతను రెస్పాన్సిబుల్ కాదు. ప్రవర్తన చాలా చెత్తగా ఉండేది. ఇటీవల దివ్య భారతిని 'చిలకా' అని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. అతన్ని సినిమా నుంచి తొలగించిన తర్వాత కొన్ని సీన్లు నెట్లో లీక్ చేశాడు. సాధారణ డైరెక్టర్ ఎప్పుడూ ఇలాంటి పని చేయడు' అని వెల్లడించారు.

ఈ ఘటనపై ఛాంబర్‌కి వెళ్లినప్పుడు, పోలీసులు దగ్గర ఫిర్యాదు చేయాలని సూచించారని ఆయన వెల్లడించారు. 'మేము పోలీస్ కేసు ఫైల్ చేశాం. అది కోర్ట్ వరకూ వెళ్లింది. కానీ ఇప్పటివరకు బయట ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ కెరీర్‌పైనా ప్రభావం చూపుతుంది, ఇండస్ట్రీలో పని చేస్తున్న మరెంతో మంది మీద ప్రభావం చూపుతుంది. ఏడాది రోజులుగా ఆ దర్శకుడు సినిమా నుంచి వచ్చిన ప్రతీ విషయాన్నీ ట్రోల్ చేస్తున్నారు' అని అన్నారు.

హీరోయినిపై వచ్చిన ట్వీట్ విషయంలో తాను స్పందించేలోపే, ఆమె స్వయంగా ఎదురుదాడి చేసిందని చంద్రశేఖర్ వెల్లడించారు. 'ఆమె చాలా ముక్కుసూటి మనిషి. సమస్య ఉంటే ఛాంబర్‌ ద్వారా పరిష్కారం కోరాలి. కానీ అతను ఎక్కడా మెంబర్ కాదు. ఇండస్ట్రీలో ఇదే అతడి తొలి ఘటన కాదు. గతంలో కూడా వివిధ సినిమాల నుంచి ఆయనను బయటకు పంపించారు. నిర్మాత దిల్ రాజు గారు కూడా అతన్ని పక్కనపెట్టి వేరే టీమ్‌తో సినిమా పూర్తిచేశారు. ఇవన్నీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయాలే. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు' అని అన్నారు.

డైరెక్టర్ వల్ల సినిమాకు భారీ నష్టం జరిగినట్లు ఆయన తెలిపాడు. 'నా సినిమా ప్రభావితమవుతోంది. డబ్బులు పెట్టినా ముందుకు జరగడం లేదు. చాలా డిలే అవుతోంది. సుధీర్ రిక్వెస్ట్‌తో నేను కోటి రూపాయల వరకు బడ్జెట్ పెంచాను. మేము 100 శాతం నిజాయితీతో పనిచేశాం. ఏది జరిగినా అది చివరికి మా మంచికే అని నమ్ముతున్నాను" అని చెప్పారు.

చివరగా హీరో సుధీర్‌పై చంద్రశేఖర్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. 'సుధీర్‌కు త్వరలోనే నిజాలు తెలుస్తాయి. ఆయన తిరిగి సినిమాకు వస్తాడని ఆశిస్తున్నాను. ఛాంబర్ కూడా ఈ విషయంలో ఒక నిర్ణయానికి వస్తుంది. ఇది సుధీర్ సినిమా. మీడియా కూడా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఆయన ప్రమోషన్‌లో భాగం అయితే, అది అతని కెరీర్‌కే మంచిది. 'గోట్' ఆయన కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది. రాబోయే ప్రమోషనల్ ఈవెంట్లకు ఆయన రావాలని ఆశిస్తున్నాం'అని స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X