This Week Movie Releases: గామి, భీమాలే కాదు.. ఆ హిట్ సినిమా కూడా ఈవారమే!
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టి అప్పుడే రెండు నెలలు గడిచిపోయింది. న్యూ ఇయర్, సంక్రాంతి, ఇలా పండుగలతో పాటు ప్రతీ వారం అదిరిపోయే సినిమాలు థియేటర్లలోకి వస్తూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందే ఉంటున్నాయి. అయితే తాజాగా కొన్ని అద్భుతమైన, ఆసక్తిరకమైన సినిమాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మరో సినిమా కూడా ఈ వారం రాబోతుంది. అయితే ఆ చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈవారం విడుదలయ్యే సినిమాల్లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన గామి మార్చి 8వ తేదీన విడుదల కాబోతుంది. విద్యాధర్ కాగిత తెరకెక్కిస్తోన్న గామి సినిమాను యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మిస్తున్నారు. నరేష్ కుమరాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అలాగే విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా కనిపించబోతుంది. వీరు మాత్రమే కాకుండా అభినయ, మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావు తదితరులు నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా శుక్రవారమే విడుదల కాబోతుంది.

అలాగే గోపీంచద్ హీరోగా.. ఏ హర్ష దర్శకత్వంలో భీమా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను కెకె రాధామోహన్ నిర్మించగా.. గోపీచంద్ సరసన ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటించబోతున్నారు. అలాగే నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘు బాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర, నిహారిక కొణిదెల, రోహిణిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా మార్చి 8వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది.
అలాగే మలయాళంలో ఇటీవలే విడుదల అయిన ప్రేమలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి 9వ తేదీన విడుదల అయిన ఈ చిత్రానికి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. అలాగే నస్లెన్ కె గఫూర్, మమితా బైజులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేశారు. అయితే ఈ సినిమాను మార్చి 8వ తేదీన అంటే శుక్రవారం రోజు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను చూసేందుకు తెలుగు కుర్రకారు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

భీమా, గామి, ప్రేమలుతో పాటు మరో సరికొత్త చిత్రం అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మార్చి 9వ తేదీన విడుదల కాబోతుంది. రవితేజ నున్నా, నేహా జురెల్ హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ సినిమాను మణికొండ రంజిత్ సమర్పణలో ముత్యాల రామదాలు, నున్నా కుమారిలు నిర్మిస్తుండగా... సత్యరాజు ద్శకత్వం వహించబోతున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై కూడా బాగానే బజ్ క్రియేట్ అయింది. చూడాలి మరి ఈ సినిమాల్లో ఏది థియేటర్ల వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుందో.


Click it and Unblock the Notifications











