Gaami Twitter Review ఫస్టాఫ్ అద్బుతంగా.. సెకండాఫ్‌లో అలాంటి మైనస్.. గామి ఎలా ఉందంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన అడ్వెంచరస్ డ్రామా గామి. వీ సెల్యూలాయిడ్, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై కార్తీక్ సబరీష్ నిర్మాతగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భారీ అంచనాలతో ఈ మూవీ మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. ఈ సినిమా గురించి ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా వేదికలపై నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

గామి సినిమా చూస్తున్నాను. తొలి 30 నిమిషాలు మాత్రం మెంటల్ మాస్. బీజీఎంతో అదరగొట్టారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గామి సినిమా ఫస్టాఫ్ చాలా బాగుంది. కానీ సెకండాఫ్ ఎంగేజింగ్‌గా లేదు. సెకండాఫ్‌లో కొంత సాగదీసినట్టు ఉంటుంది. కొన్ని కీలక సన్నివేశాలు ఆదరబాదరాగా ముగించినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా బాగుంది. ఇటీవల కాలంలో నేను చూసిన అత్యుత్తమ సినిమాటోగ్రఫి ఈ సినిమాలోనే ఉంది. ఈ సినిమాను తప్పకుండా చూడండి.. మిస్ చేసుకోకండి.
గామి సినిమా చూశాను. ఇలాంటి స్టోరిని నమ్మి నిర్మించినందుకు నిర్మాత కార్తీక్ సబరేష్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇలాంటి అవుట్‌పుట్‌ను అందించిన దర్శకుడు గ్రేట్ ఎఫర్ట్ పెట్టాడని చెప్పాలి. సినిమాటోగ్రాఫి టాప్ నాచ్‌లో ఉంది. బీజీఎం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండాల్సిందనే ఫీలింగ్ కలిగింది.
గామి సినిమా చాలా స్గ్రాంగ్‌గా మొదలైంది. ఫస్టాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. కానీ సెకండాఫ్ చాలా స్లోగా ఉంది. కొన్ని పార్ట్స్‌లో తొందరపాటు కనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో అద్బుతమైన విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫ్ టాప్ లెవెల్‌లో ఉంది. ఓవరాల్‌గా డీసెంట్ సినిమా. తప్పకుండా చూడాలి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
గామి గురించి నేను చాలా సీరియస్‌గా చెబుతున్నాను. టీమ్ చాలా హార్డ్ వర్క్ పెట్టడం వల్ల వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇచ్చారు. కానీ సెకండాఫ్‌లో చాలా సాగదీసినట్టు అనిపిస్తుంది. కంటెంట్ వైజ్‌గా ఫస్టాఫ్ చాలా బాగుంది. విజువల్ పరంగా సెకండాఫ్ బాగుంది. క్లైమాక్స్‌లో ట్విస్టులు బాగున్నాయి. సింహం ఎపిసోడ్ బాగుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. గామీ అమేజింగ్ సినిమా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











