ఆయనకు 56 ఇంచులు.. మావోడికి 62 అంగుళాల ఛాతీ.. బాలీవుడ్ హీరోపై దారుణంగా ట్రోలింగ్

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ కాషాయ తీర్థం పుచ్చుకొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరారు. పంజాబ్‌లోని గురుదాస్ పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. 1997లో వచ్చిన బోర్డర్ చిత్రం ద్వారా తన నటనతో అందరిలో దేశభక్తిని నింపారు. ఆయనకు ఉన్న జాతీయభావం అతడి సినిమాలు చెబుతాయి అని అన్నారు. అయితే సన్నిడియోల్ బీజేపీలో చేరడంపై గదర్ దర్శకుడు అనిల్ శర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

అప్పుడు నా తండ్రి.. ఇప్పుడు నేను

అప్పుడు నా తండ్రి.. ఇప్పుడు నేను

సన్నిడీయోల్ బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అటల్ బీహారి వాజ్ పేయ్ నేతృత్వంలో నా తండ్రి ధర్మేంద్ర చేరారు. ఇప్పుడు మోడీ నాయకత్వంలో నేను చేరుతున్నాను. మరో ఐదేళ్లు ప్రధానిగా మోదీ ఉండాలని కోరుకొంటున్నాను. ప్రధాని మోదీ దేశానికి ఎంతో సేవ చేశారు అని అన్నారు.

 కలలో కూడా ఊహించలేదు

కలలో కూడా ఊహించలేదు

రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు. సేవ చేయడమే నా వృత్తి అయితే నేను ఎలాంటి సేవకైనా సిద్ధం. మరోకటి చేసే బదులు ప్రజలకు మేలు చేసే పనిచేయడమే ధర్మం. మంచి వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సన్నీడియోల్ అన్నారు.

 మా వాడికి 62 అంగుళాల ఛాతీ అని

మా వాడికి 62 అంగుళాల ఛాతీ అని

సన్నీ డియోల్ బీజేపీలో చేరడంపై గదర్ దర్శకుడు అనిల్ శర్మ సానుకూలంగా స్పందించారు. కాషాయ పార్టీలో చేరిన హీరోకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీకి 56 అంగుళాల ఛాతీ ఉంది. ఇప్పుడు మా హీరోకు 62 అంగుళాల ఛాతీ ఉంది. ఇద్దరు కలిస్తే ఇంకేముంది. నా ఫేవరేట్ యాక్టర్‌కు కంగ్రాట్స్ అని అనిల్ శర్మ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్

సన్నీ డియోల్ బీజేపీలో చేరడంపై నటి కోయినా మిత్రా స్పందిస్తూ.. కాస్త జాగ్రత్తగా ఉండు అని ట్వీట్ చేశారు. ఇక ముందు సన్నిడియోల్ సర్జికల్ స్ట్రయిక్స్ ఈయనే చేస్తారా? అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక ముందు సన్నిడియోల్ గ్రౌండ్ వాటర్ మినిస్టర్‌ అవుతాడా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X