విశాఖ తీరాన గద్దలకొండ గణేష్ గత్తర.. ఓ లుక్కేయండి మీకే తెలుస్తది
గద్దలకొండ గణేష్ గత్తర ఇప్పట్లో ఆగేలా లేదు. సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన గద్దలకొండ గణేష్ తన జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఓ వైపు థియేటర్స్‌లో హంగామా చేస్తూనే మరోవైపు నేరుగా అభిమానులను కలిసి సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం గద్దలకొండ గణేష్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ టూర్‌లో ఉన్నాడు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులను పలకరిస్తున్నాడు.
సెప్టెంబర్ 24వ తేదీన వరంగల్ నుంచి విజయోత్సవ యాత్ర చేపట్టిన గద్దలకొండ గణేష్ చిత్ర యూనిట్.. సెప్టెంబర్ 27వ తేదీన వైజాగ్‌లో ఈ యాత్ర ముగించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా అదే రోజు సాయంత్రం సక్సెస్ మీట్ కూడా చేపడుతున్నట్లుగా పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో ఈ సక్సెస్ మీట్ జరగనుందని ప్రకటించారు.

మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది గద్దలకొండ గణేష్ సినిమా. విడుదలైన మొదటి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 5 రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చిత్రంలో వరుణ్ తేజ్ మాస్ పర్‌ఫార్‌మెన్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ సృష్టిస్తున్న సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు!.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











