గద్దర్ ప్రధాన పాత్రలో ఉక్కు సత్యాగ్రహం.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సినీ యుద్దం.. హీరో ఎవరంటే?

సామాజిక సమస్యలు, సోసైటీలో బర్నింగ్ టాపిక్స్, పాలకులను ప్రశ్నించే చిత్రాలతో ఆకట్టుకొన్న నిర్మాత సత్యారెడ్డి మరోసారి ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలను సంధించడానికి సిద్దంగా ఉన్నారు. గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్పదీక్ష,ప్రత్యూష, ప్రశ్నిస్తా సినిమాలతో పాటు 52 చిత్రాలు నిర్మించిన ఘనత ఆయన పేరిట ఉంది. తాజాగా సత్యారెడ్డి హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ఉక్కు సత్యాగ్రహం. ఆంధ్రుల హక్కు.. విశాఖ హక్కు అంటూ సాధించుకొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణ బ్యాక్ డ్రాప్‌గా ఆయన సినిమాను జనం ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

శరవేగంగా ఉక్కు సత్యాగ్రహం : ఉక్కు సత్యాగ్రహం సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. వైజాగ్ ఆర్కే బీచ్, అరిలోవా,ఆంధ్రా వర్సిటీతోపాటు రామానాయుడు స్టూడియోలో ఇటీవల తాజా షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నారు.ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు, పోలీసులతో పోరాట సన్నివేశాలును చిత్రీకరించారు. మరికొన్ని కీలక సన్నివేశాలను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.

Gaddar

గద్దర్ ప్రధాన పాత్రలో : ఉక్కు సత్యాగ్రహం సినిమాలో ప్రజా యుద్ధనౌక గద్దర్‌ కీలకపాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా పల్సర్‌ బైక్‌ ఝాన్సీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. నిర్మాత ప్రసన్నకుమార్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రాజకీయ నేతలు వైజాగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

Gaddar

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వివాదం : హీరో, దర్శక, నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వివాదం నేపథ్యంలో దాని సాధన కోసం జరిగిన పోరాటం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాట నేపథ్యంగా ఉక్కు సత్యాగ్రహం రూపొందుతున్నది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జేఎసీ చైర్మన్‌ అయెధ్య రాం, మర్రి రాజశేఖర్‌, ఆదినారాయణ, కేఎస్ఎన్ రావుతోపాటు యూనియన్‌ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు స్వచ్ఛందంగా ఈ చిత్రంలో నటించారు అని తెలిపారు.

Gaddar

అత్యంత కీలక వ్యక్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు: ఉక్కు సత్యాగ్రహం రియాలిటికి దగ్గరగా ఉంటుంది. గద్దర్‌, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. ఈ సినిమా సంగీతం హైలైట్‌గా ఉంటుంది. అతి త్వరలో ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహిస్తాం. రాష్టంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ వేడుకకు అతిథిగా హాజరవుతారు అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X