విశాఖ ఉక్కు కోసం కదం తొక్కిన గద్దర్..ఉక్కు సత్యాగ్రహం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ వ్యక్తి!

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంతో సాధించిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పదమైంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎన్నో ఉద్యమ సంఘాలు కదం తొక్కాయి. అయితే తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ఉక్కు సత్యగ్రహం పేరుతో సినిమా నిర్మిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత సత్యారెడ్డి హీరోగా నటిస్తూ, స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో ఉక్కు సత్యగ్రహం సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రజా యుద్దనౌక గద్దర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

Gaddar playing crucial role in Satya Reddys Ukku Satyagraham

ఉక్కు సత్యాగ్రహం సినిమాలో సినీ, రాజకీయ ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో స్టీల్ ప్లాంట్ పోరాట కమిటి నేతలు అయోధ్య రామ్, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్, కేఎస్ఎన్ రావు, మీరా పల్నాడు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావు తదితరులు నటిస్తున్నారు.

దర్శక, నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ సాధన కోసం జరిగిన పోరాటం నేపథ్యంతో ఉక్కు సత్యాగ్రహం రూపొందుతున్నది. స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు ఈ సినిమాలో నటిస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉంటే ఈ సినిమా యువతరాన్ని తప్పకుండా ఆలోచింపజేస్తుంది అని అన్నారు.

Gaddar playing crucial role in Satya Reddys Ukku Satyagraham

ఉక్కు సత్యగ్రహం సినిమా కోసం గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, మజ్జి దేవీశ్రీ లాంటి గొప్ప రచయితలు పాటలు రాశారు. శ్రీ కోటి మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆర్కే బీచ్‌లో నిర్వహిస్తాం. ఈ వేడుకకు ప్రముఖ వ్యక్తి చీఫ్ గెస్టుగా హాజరవుతారు అని తెలిపారు.

నిర్మాత సత్యారెడ్డి విషయానికి వస్తే.. గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, రంగులకళ, సిద్ధం, కుర్రకారు, ప్రత్యూష, టీ నగర్ (తమిళ్), గ్లామర్, ప్రశ్నిస్తాతోపాటు మొత్తం 52 సినిమాలను నిర్మించారు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X