రామ్ గోపాల్ వర్మ మీద బూతులు.. ఒక్క వీడియోతో స్టార్ అయిన 'గద్వాల్ బిడ్డ' మృతి!

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఈ సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఒక్క రాత్రిలో స్టార్లుగా మారిపోతున్నారు సామాన్యులు. అలా అనుకోకుండా రామ్ గోపాల్ వర్మ మీద ఒక వీడియో చేసి గుర్తింపు తెచ్చుకున్న బాలుడు ఆ తర్వాత సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు. గద్వాల్ బిడ్డగా ఫేమస్ అయిన మల్లికార్జున్ రెడ్డి అనారోగ్య కారణాలతో మరణించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఎన్నికల తర్వాత

ఎన్నికల తర్వాత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనేక వివాదాస్పద సినిమాలు ప్రకటిస్తూ వాటిని చేస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. సరిగ్గా 2019 ఎన్నికల తర్వాత కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ ఒక సినిమా చేయడానికి ఆయన ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ చంద్రబాబు మధ్య అధికార మార్పిడి ఎలా జరిగింది అనే విషయం మీద వర్మ సినిమా చేశారు.

ఒక్క వీడియోతో

ఒక్క వీడియోతో

అయితే కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని కోర్టు కేసులు అవడంతో దానిని అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే పేరుతో మార్చి విడుదల చేశారు. ఈ సినిమా విడుదల సమయంలో చాలామంది సినిమా టైటిల్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు కానీ ఒక బుడతడు రామ్ గోపాల్ వర్మ మీద బూతులు తిడుతూ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వయసులో తెలియకే చేసుంటాడు కానీ ఆ ఒక్క వీడియోతో అతను సోషల్ మీడియాలో ఫేమస్ ఫిగర్ గా మారిపోయాడు.

ఖబర్దార్ బిడ్డ

ఖబర్దార్ బిడ్డ

సోషల్ మీడియాలో ఒకే వీడియోతో సంచ‌ల‌నం సృష్టించిన గద్వాల బిడ్డ అలియాస్ మ‌ల్లికార్జున్ రెడ్డి. ఆదివారం నాడు ఆ బుడతడు మృతి చెంద‌డం తీవ్ర విషాదంగా మారింది.. ‘నువ్వు ఎవనివో నాకు తెల్వదు... మా జోలికొస్తే ఖబర్దార్ బిడ్డ... నేను గద్వాల బిడ్డ..' అంటూ వర్మ మీద తెలిసితెలియ‌క చేసిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయాడు మల్లికార్జున్.. అదే వీడియోలో దళితుల మీద కూడా కొన్ని కామెంట్లు చేశాడు.

అనారోగ్య స‌మ‌స్య‌లతో

అనారోగ్య స‌మ‌స్య‌లతో

తన గ్రామంలోని దళితులే ఇంటి మీదకు కూడా రావడంతో తల్లి సూచనతో అతను చివ‌ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.. ఆ త‌ర్వాత మ‌రికొన్ని వీడియోల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు ఈ బుడ‌త‌డు. అనారోగ్య స‌మ‌స్య‌లు గద్వాల బిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి ప్రాణాలు తీశాయి. చిన్నతనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బుడ‌త‌డు ఆదివారం మృతిచెందాడు.

Recommended Video

RGV - Judicial Process లో ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళే జడ్జ్ అవడం తప్పు | Filmibeat Telugu
'ఏం చేస్తున్నావ్' సినిమాలో

'ఏం చేస్తున్నావ్' సినిమాలో

అతని స్వగ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నలో సోమవారం నాడు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు కుటుంబసభ్యులు వెల్ల‌డించారు. కేవలం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేసి ఒకే వీడియోతో సంచ‌ల‌నంగా మారి ఆ త‌ర్వాత మీమ్ సబ్జెక్ట్ గా మారి అందరికీ నోటెడ్ అయిన మ‌ల్లికార్జున్ రెడ్డికి సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలుపుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియా క్రేజ్ తో 'ఏం చేస్తున్నావ్' సినిమాలో నటించి, డబ్బింగ్ కూడా చెప్పాడు గద్వాల్ బిడ్డ మల్లికార్జున్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X