twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో మరో పీరియాడిక్ మూవీ.. 80వ దశకం నేపథ్యంతో గగన వీధి

    |

    టాలీవుడ్‌లో పీరియాడిక్ నేపథ్యంగా వచ్చిన చిత్రాలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. పీరియాడిక్ నేపథ్యంతో వచ్చిన చారిత్రాత్మక చిత్రాలు గానీ, సోషల్ ఫాంటసీ చిత్రాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులను మెప్పించాయి. రంగస్థలం, సైరా లాంటి భారీ బడ్జెట్‌తో, ప్లేబ్యాక్ లాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు టాలీవుడ్ క్రిటిక్స్‌ను మెప్పించాయి. ఈ కోవలో వినూత్నమైన కథ, కథనాలతో వస్తున్న చిత్రం గగన వీధి. మంచి కథ, కథనాలతో వస్తున్న పీరియాడిక్‌ చిత్రాల స్పూర్తితో యువ దర్శకుడు అమర్నాథ్ రెడ్డి గుంటక తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

    నిర్మాత ఆర్కే రెడ్డి నిర్మాణ సారథ్యంలో ప్రేక్షకులకు స్పూర్తిని రగలించే విధంగా 80 దశకం నేపథ్యంగా వస్తున్న ఈ చిత్రానికి అమర్నాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకొని టైటిల్ లుక్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్నది. ఆరంభంలోనే మీడియా నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఫస్ట్ లుక్ తర్వాత ట్రేడ్ వర్గాల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నది. అనేక ప్రాంతాల నుంచి డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల నుంచి ఎంక్వైరీలు మొదలయ్యాయి. మా సినిమాపై అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఈ సినిమాను రిచ్, ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాం.

     Gagana Veedhi movie getting good response after first look launch

    తమ గగన వీధి చిత్ర టైటిల్ లుక్‌కు వస్తున్న రెస్పాన్స్ దర్శకుడు అమర్ నాథ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న మా చిత్ర కథ గురించి వెల్లడించారు. యువత తలుచుకుంటే.. ఏదైనా చేయ్యగలదు అనే చక్కటి సందేశంతో కూడిన కథాంశం. తప్పకుండా ప్రేక్షకులకు, యువతకు మంచి స్పూర్తిని కలిగిస్తుంది. మా చిత్రంలో మెయిల్ మూవీ ఫేమ్ యువ కథానాయకుడు హర్షిత్‌రెడ్డి హీరోగా, ఎన్నో చిత్రాల్లో నటించి మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న, సింధూరపువ్వు రాంఖీ, సినిమా బండి మూవీలో లీడ్ రోల్ చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన వికాస్ వశిష్ఠ, నారప్ప లో చిన్నప్ప పాత్రలో చిన్నకొడుకుగా నటించిన రాఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. సింధూరపువ్వు రాంఖీ నటించడం ద్వారా మా సినిమాకు మంచి క్రేజ్ పెరిగింది. రాంఖీ పాత్ర చాలా ఎమోషనల్‌తో ఉంటుంది. వికాస్ వశిష్ట, నారప్ప ఫేమ్ రాఖీ పాత్రల యూత్‌ను బాగా ఆకట్టుకొంటాయి. తెలుగు సినిమా పరిశ్రమలో గగన వీధి తప్పకుండా మంచి చిత్రం అవుతుంది అని అన్నారు.

    మా చిత్రం పూజ కార్యక్రమాలతో పాటు టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం జరిగింది. త్వరలో విభిన్నమైన ప్రమోషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని కోరుతున్నాం. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తాం. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే త్వరలోనే థియేటర్లలో రిలీజ్ చేస్తాం అని అన్నారు.

     Gagana Veedhi movie getting good response after first look launch

    నటీనటులు, సాంకేతిక నిపుణులు
    సింధూరపువ్వు రాంఖీ, హర్షిత్ రెడ్డి, వికాస్ వశిష్ట, రాంఖీ తదితరులు
    బ్యానర్: అశోక పిక్చర్స్
    నిర్మాత: ఆర్‌కే రెడ్డి
    దర్శకత్వం: అమర్ నాథ్ రెడ్డి గుంటక
    మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ చరణ్ పాకాల
    మాటల రచయిత: ఐ రవి
    డివోపీ: జిఎల్ఎన్ బాబు
    ప్రొడక్షన్ మేనేజర్: సుబ్బారావు
    పిఆర్వో: మధు వి ఆర్

    English summary
    Gagana Veedhi movie getting good response after first look launch movie. This movie is sets back drop of the 80s. Director says that This is inspirational story for youth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X