twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ హీరోతో హాట్ హాట్‌గా కేథరిన్ థెరిస్సా..

    |

    ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుంటూ న‌టుడుగా త‌న సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటోన్న హీరో ఆర్య‌. ఆ కోవ‌లోనే భారీ బడ్జెట్ తో మ‌రో విభిన్న‌మైన చిత్రం క‌దంబ‌న్ లో హీరోగా న‌టించాడు. హీరోయిన్ గా కేథ‌రిన్ థెరిస్సా న‌టించింది. రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించి ఆర్య కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫ్రేమ్స్ ప‌తాకంపై భార‌తి వరప్రసాద్ వ‌డ్డెల్ల స‌మ‌ర్ప‌ణ‌లో ఉద‌య్ హ‌ర్ష వ‌డ్డెల్ల నిర్మాత‌గా గ‌జేంద్రుడు పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

    ఈ సంద‌ర్బంగా నిర్మాత ఉద‌య్ హ‌ర్ష వ‌డ్డెల్ల మాట్లాడుతూ... హీరో ఆర్య అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డు. హీరోగా , విల‌న్ గా త‌ను తెలుగులో అద్భుమైన సినిమాలు చేశారు. అలాగే అందాల తార కేథ‌రిన్ ,ఆర్య స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించింది. వీరిద్ద‌రి జంట తెర‌పై క‌నువిందు చేస్తుంది అని అన్నారు.

    Gajendurudu set to release on June 21st

    కదంబన్ చిత్రం త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించి..క్రిటిక్స్ నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్నది. ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో హీరోయిన్స్ న‌టించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్ కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెర‌గ‌డ‌మే కాకుండా షూటింగ్ స‌మ‌యంలో ఆ కొండ‌ల్లో ఎంతో శ్ర‌మించి షూటింగ్ చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాకు మ‌రో హైలెట్ గా యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. ఈ నెల 21న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అని ఉదయ్ అన్నారు

    Gajendurudu set to release on June 21st

    English summary
    Kadamban action adventure drama film written and directed by Ragava and produced by R. B. Choudary under Super Good Films. The music was composed by Yuvan Shankar Raja, cinematography by S. R. Sathish Kumar. Catherine Tresa, Arya are lead pair in this movie. This movie coming as Gajendurudu in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X