Don't Miss!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యువ హీరోతో హాట్ హాట్‌గా కేథరిన్ థెరిస్సా..
ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటుడుగా తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోన్న హీరో ఆర్య. ఆ కోవలోనే భారీ బడ్జెట్ తో మరో విభిన్నమైన చిత్రం కదంబన్ లో హీరోగా నటించాడు. హీరోయిన్ గా కేథరిన్ థెరిస్సా నటించింది. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించి ఆర్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై భారతి వరప్రసాద్ వడ్డెల్ల సమర్పణలో ఉదయ్ హర్ష వడ్డెల్ల నిర్మాతగా గజేంద్రుడు పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్బంగా నిర్మాత ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ... హీరో ఆర్య అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. హీరోగా , విలన్ గా తను తెలుగులో అద్భుమైన సినిమాలు చేశారు. అలాగే అందాల తార కేథరిన్ ,ఆర్య సరసన హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి జంట తెరపై కనువిందు చేస్తుంది అని అన్నారు.
కదంబన్ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించి..క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నది. ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో హీరోయిన్స్ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్ కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెరగడమే కాకుండా షూటింగ్ సమయంలో ఆ కొండల్లో ఎంతో శ్రమించి షూటింగ్ చేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాకు మరో హైలెట్ గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. ఈ నెల 21న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం అని ఉదయ్ అన్నారు