చీల్చి చెండాడుతున్నారు.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై దిల్ రాజ్ ఆవేదన!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ సినిమా వివాదంపై తాజాగా స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. దాంతో గేమ్ ఛేంజర్ సినిమాతో నిర్మాతలు భారీగా నష్ట పోయారంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా అనేది బిజినెస్ ఒక దానితో హిట్, మరోదానితో ఫెల్యూర్ రావడం సహజమే అభిప్రాయాల నేపథ్యంలో రీసెంట్ గా గేమ్ ఛేంజర్ నిర్మాత శిరీష్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకు రామ్ చరణ్ అభిమానులు కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు. పదే పదే ఇదే రిపీట్ అవుతుండటం పట్ల దిల్ రాజ్ తాజాగా అసహనం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడారు.

గేమ్ ఛేంజర్ వివాదం..
కోలీవుడ్ స్టార్ స్టార్ డైరెక్టర్ శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న గేమ్ ఛేంజర్ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. నెగెటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫెయిల్ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. ఇక నిర్మాతలు సినిమా ఫెయిల్ ను జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత శిరీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కనీసం మెగాస్టార్ చిరంజీవి గేమ్ ఛేంజర్ ఫెల్యూర్ పై స్పందించలేదని, రామ్ చరణ్ కూడా అదే ధోరణి అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వివాదం మరింతగా ముదిరింది.

Game Changer Box Office Collections Issue

రామ్ చరణ్ అభిమానులు పైర్..
ఇక గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ ఫెల్యూర్ విషయంలో తమ అభిమాన హీరోను అనవసరంగా నిందిస్తున్నారని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మీ సినిమాలో నటించడం ఆయన చేసిన తప్పునా అంటూ ప్రశ్నించారు. సినిమాల్లో లాభాలు వస్తే మీరు హీరోలకు తిరిగి ఏమైనా ఎక్కువ డబ్బులు ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. మరిన్ని అంశాలను లేవనెత్తుతూ తమ అభిమాన హీరోపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు.

దిల్ రాజ్ క్లారిటీ..
రామ్ చరణ్ అభిమానులు హెచ్చరిస్తూ లేఖ విడుదల చేయడంతో తాజాగా నిర్మాత దిల్ రాజ్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూల్లో స్పందించారు. గేమ్ ఛేంజర్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఇంకా అదే సినిమాను పట్టుకొని ఎందుకు చర్చ పెడుతున్నారని దిల్ రాజ్ ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత ఎన్ని సినిమాలు ఫెయిల్ కాలేదా అన్నారు. ఇక రామ్ చరణ్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, మున్ముందు మరో సాలిడ్ సబ్జెక్ట్ తో సినిమా తీస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం నితిన్ తమ్ముడు సినిమా పైనే ఉందని అన్నారు.

రామ్ చరణ్, దిల్ రాజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండటం విశేషం. రూ.300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక నిర్మాత దిల్ రాజ్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఇక నెక్ట్స్ రూ.75 కోట్లతో నితిన్ తమ్ముడు చిత్రాన్ని జూలై 4న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X