Game Changer గేమ్ ఛేంజర్ సాంగ్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ పోలీస్ టీమ్

గ్లోబల్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన పాటను సోషల్ మీడియాలో లీక్ చేసిన వారిపై తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం కొరడా ఝుళిపించింది. చిత్ర యూనిట్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ వెంటనే ఇద్దర్ని గుర్తించి అరెస్ట్ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ సినిమాకు లీకుల బెడద భారీగానే ఉంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు, వీడియో క్లిప్లింగ్స్ సోషల్ మీడియాలో వెలుగు చూడటం యూనిట్‌ను అందోళనకు గురిచేసింది. అయితే ఇలాంటి లీకులను ఎదుర్కోవడానికి ప్రొడక్షన్ టీమ్ వెంటనే చర్యలు చేపట్టింది. తమ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను కొందరు ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తున్నారనే ఫిర్యాదును సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ దృష్టికి తెచ్చింది.

Game Changer Jaragandi Song Leak: Cyber Police arrest two for leaking Global Star Ram Charan Song

రాంచరణ్ తాజా సినిమా గేమ్ ఛేంజర్ యాక్షన్ సీన్లు ఇటీవల లీక్ అయ్యాయి. అనేక పైరసీ సమస్యలు ఎదురుపడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ లీకవ్వడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే యూనిట్ హెచ్చరికలు చేసినా లీకు వీరుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు.

ఇక తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి పాటను ఫుటేజ్‌ సోషల్ మీడియాలో కనిపించింది. దాంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో దర్యాప్తు చేపట్టిన సైబర్ పోలీసులు అందుకు బాధ్యులైన ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ ఇద్దరిని విచారించిన అనంతరం అలాంటి ప్రయత్నాలు మళ్లీ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Game Changer Jaragandi Song Leak: Cyber Police arrest two for leaking Global Star Ram Charan Song

గేమ్ ఛేంజర్ సినిమా పాట జరగండి లీక్ తర్వాత చిత్ర యూనిట్ అభిమానులకు శుభవార్తను అందజేసింది. దీపావళీ పండుగను పురస్కరించుకొని పాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోపాటు పాటకు అద్బుతంగా తమన్ తీర్చి దిద్దారు. పాన్ ఇండియా మూవీగా తిర్చిదిద్దుతున్న ఈ సినిమాను శంకర్ అద్బుతంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

Game Changer Jaragandi Song Leak: Cyber Police arrest two for leaking Global Star Ram Charan Song

గేమ్ ఛేంజర్ సినిమా పైరసీకి అడ్టుకట్ట వేసేందుకు ప్రయత్నించిన, వేగంగా స్పందించిన సైబర్ క్రైమ్ డివిజన్‌కు చెందిన ఏసీపీ చాంద్ భాష, ఇన్స్‌పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ప్రసేన్ రెడ్డి, సాయితేజ శ్రీ, ఇతర సభ్యులను చిత్ర యూనిట్ ప్రశంసలు కురిపించారు. పాటను లీక్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి తగిన విచారణ చేపట్టినందుకు అభినందనలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X