ఖబడ్దార్.. ఇదే లాస్ట్ వార్నింగ్.. గేమ్ ఛేంజర్ ఇష్యూపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తాజాగా 'ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక' అంటూ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరి చిత్రం గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన నష్టాలపై వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక రీసెంట్ గా గేమ్ ఛేంజర్ నిర్మాతలు ఏకంగా రామ్ చరణ్ ను బ్లేమ్ చేస్తూ ఇంటర్వ్యూల్లో మాట్లాడటం హాట్ టాపిక్ గ్గా మారింది. దీంత రామ్ చరణ్ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. తమ అభిమాన హీరోది ఏమాత్రం తప్పు లేదని, అనవసరంగా నిందిస్తున్నారంటూ పలు అంశాలను లేవనెత్తుతూ తిరిగి సమాధానం ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ సినిమా వివాదం ఏంటీ..
ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫిల్మ్ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ దిల్ రాజ్, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, సముద్రఖని వంటి ప్రముఖులు నటించారు. దీంతో 350 కోట్లకు పైగా బడ్జెట్ అయ్యింది. జనవరి 10, 2025న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి లైఫ్ టైమ్ రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అదే స్థాయిలో నష్టాలను మిగిలిచ్చిందని మేకర్స్ చెప్పడంతో వివాదం మొదలైంది.

Game Changer Movie Controversy

చిరు, రామ్ చరణ్ పై గేమ్ ఛేంజర్స్ నిర్మాత వ్యాఖ్యలు..
గేమ్ ఛేంజర్ ఫెల్యూర్ అవ్వడంతో నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా భారీ నష్టాలను మిగిల్చిందని నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్ ఇటీవల ఇంటర్వ్యూలో బహిరంగంగా మాట్లాడారు. వారి మాటల్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పై అల్లు శిరీష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా ఫెల్యూర్ పై చిరు, చరణ్ కనీసం మర్యాదకు కూడా విచారించలేదంటూ ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చారు.

రామ్ చరణ్ అభిమానుల సంఘం ఫైర్..
ఈ వివాదంపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమనులు తాజాగా ఘాటుగా స్పందించారు. 'ఇది గమనిక కాదు.. చివరి హెచ్చరిక! సినిమా అనేది బిజినెస్. దానిలో లాభాలు వస్తాయి. నష్టాలు వస్తాయి. మీ ప్రొడక్షన్ హౌజ్ లో మీరు చేసే సినిమాలు అన్ని మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టం జరగడంతో అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్యాయం అన్నారు. 14 రీల్స్ బ్యానర్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లలో వచ్చిన పలు సినిమాలు ఫెయిల్ అయితే హీరోలను నిందించారా? ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయితే వెంకటేశ్ కు ఏమైనా ఎక్కువ డబ్బులు ఇచ్చారా?

అసలు దర్శకుడు శంకర్ దగ్గరికి వెళ్లింది ఎవరు? మూడేళ్ల పాటు రామ్ చరణ్ సమయాన్ని వృథా చేసిందెవరు? RRR తర్వాత మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన హీరో మీద మీరు విషం చిమ్మడం కరక్టేనా?' అని ప్రశ్నల వర్షం కురిపించారు. అభిమానులుగా మూడేళ్ల నుంచి వేయిట్ చేసి ఫెయిల్ అయ్యిందనే బాధలో ఉన్నాం. కానీ మీరు ప్రతిరోజూ ఇదే మాట్లాడుతూ, మా హీరోను విషం చిమ్ముతూనే ఉన్నారు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూల్లో దుష్ప్రచారం చేస్తుండటంపై మా ఇదే చివరి హెచ్చరిక. రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖబడ్దార్..' అంటూ ప్రకటన విడుదల చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.

More from Filmibeat

Read more about: ram charan game changer dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X