Game Changer Release Date leak: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకూ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇండియాలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గత కొన్ని ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నది. అయితే ఈ సినిమా షూటింగ్ ముగించుకొని రిలీజ్‌కు రెడీ అవుతున్నది. ఈ మేరకు లీకైన రిలీజ్ డేట్ వివారాల్లోకి వెళితే..
రాం చరణ్ తన కెరీర్‌లో ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ మాదిరిగా భావిస్తున్న చిత్రం కొన్నేళ్లుగా సెట్స్‌లోనే ఉండిపోయింది. ఇండియన్ 2 వివాదం కారణంగా కొన్ని నెలలు వాయిదా పడితే.. ఆ తర్వాత RRR మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రాంచరణ్ అమెరికాకు వెళ్లడంతో సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ఉపాసన డెలివరీ కోసం రాంచరణ్ షూటింగ్ దూరంగా ఉండటంతో ఈ సినిమా సెట్స్‌పైనే ఉండిపోయింది.

అయితే కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది. శంకర్, రాంచరణ్ కలిసి ఈ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం రెగ్యులర్‌గా షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇటీవలే వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకొని వచ్చారు.
అయితే ఈ సినిమా గురించి ఇటీవల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. కానీ ఆ డేట్ చెప్పే అధికారం నాకు లేదు. శంకర్ ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇక అంతా శంకర్ చేతుల్లోనే విడుదల తేదీ ఉంది అని చెప్పారు.

అయితే గేమ్ ఛేంజర్ మూవీ నార్త్ ఇండియా, హిందీ బిజినెస్ ఇటీవల పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాను హిందీ ప్రాంతంలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత అనిల్ తడానీ సిద్దమయ్యారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ నెలలో ఏ రోజున విడుదల చేయాలనే డేట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











