Ram Charan Net Worth: గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లంటే? ఉపాసన షేర్ ఎంతంటే?

Ram Charan Net Worth: ఆర్ఆర్ఆర్ స‌క్సెస్‌తో రామ్ చరణ్ పాపులాటి పూర్తిగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ నుండి ఎన్నో క్రేజీ ఆఫర్స్ అందుకున్నాడు. తాజాగా సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆశించిన స్తాయిలో సినిమా సక్సెస్ కాకున్న మిక్స్ డ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ఆస్తుల విలువ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అదేంటో చూద్దాం..

రామ్ చరణ్ ఆస్తుల వివరాలు వస్తే.. టాలీవుడ్ లో మల్టీ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ 2016లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఖైదీ నంబర్ 150 (2017), సైరా నరసింహా రెడ్డి (2019), ఆచార్య (2022) వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఈ ప్రొడక్షన్ హౌస్ వెలువడ్డాయి.అలాగే.. 2023లో రామ్ చరణ్ UV క్రియేషన్స్ విక్రమ్ రెడ్డితో కలిసి V మెగా పిక్చర్స్ అనే మరో నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. త్వరలో వారు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భాగస్వామ్యంతో తమ మొదటి ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్‌ని కూడా ప్రకటించారు.

Game Changer Star Ram Charan net worth investement Wealth full details

ఇదే కాకుండా.. గుర్రపు స్వారీపై అభిమానంతో రామ్ చరణ్ 2011లో హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ అనే పేరుతో తన సొంత పోలో టీమ్‌ని ప్రారంభించారు. అంతేకాకుండా.. ఎయిర్ వేస్ లో కూడా అడుగుపెట్టారు. 2013లో రామ్ చరణ్ టర్బో మేఘా ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే విమానయాన సంస్థను ప్రారంభించారు. రెండు సంవత్సరాల తరువాత ఈ ఎయిర్‌లైన్స్ ను ట్రూజెట్‌ గా పేరు మార్చారు. కానీ, ఫిబ్రవరి 2022లో తమ విమానయాన సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది. ఇవే కాకుండా.. డెవిల్స్ సర్క్యూట్ అని పిలువబడే రన్నింగ్ సిరీస్‌కు రామ్ చరణ్ సహ యజమాని.

అలాగే.. 2017లో ఉపాసన కామినేని ఛాలెంజింగ్ అబ్స్టాకిల్ కోర్సులో కూడా ప్రారంభించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్లాగ్‌ను పంచుకున్నారు. ఇక అపోలో హాస్పిటల్స్.. ఎన్నో వ్యాపారాల్లో అడుగుపెట్టి సక్సెస్ గా రాణిస్తున్నారు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని. ఉపాసన తాత ప్రతాప్ చంద్రారెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఉపాసన .. అపోలో హాస్పిటల్స్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) వైస్ చైర్‌పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. వీటితో పాటు పెప్సీ, ఫ్రూటీతో పాటు ప‌లు బ్రాండ్స్‌కు చ‌ర‌ణ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ఒక్కో యాడ్ కోసం రామ్ చరణ్ 2 నుంచి 3 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటారంట. అంతే కాదు సోష‌ల్ మీడియాలో రామ్‌చ‌ర‌ణ్‌కు భారీగా ఫాలోయింగ్ ఉంది.

Game Changer Star Ram Charan net worth investement Wealth full details

ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియ‌న్లు, ట్విట్ట‌ర్‌లో 3.5 మిలియ‌న్ల తో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ ఉన్నటాలీవుడ్ హీరోల్లో ఒక‌రిగా చ‌ర‌ణ్ నిలిచారు. రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద కోట్ల విలువైన ప‌లు లాగ్జరీ కార్లు ఉన్నాయి. మెర్సిడేజ్ మేబ్యాచ్ ( 4 కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంథ‌మ్ ( 9 కోట్లు)తో పాటు ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి కార్లు చ‌ర‌ణ్ వ‌ద్ద ఉన్నాయి.ఇక రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 70 కోట్ల నుంచి 100 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటారంట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X