Game Changer: గేమ్ ఛేంజర్ టీంకి బెదిరింపులు.. వాళ్ళని వదిలిపెట్టం అంటూ బిగ్ ట్విస్ట్

ఇటీవల పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా వైడ్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా వచ్చిన మరో చిత్రమే "గేమ్ ఛేంజర్". గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఇండియాస్ ఫస్ట్ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కలయికలో చేసిన ఈ మొదటి తెలుగు సినిమా రిలీజ్ కి ముందే చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

అనుకున్న దానికంటే ఆలస్యంగా సినిమా రిలీజ్ కి రావడం దీని ఫలితం సినిమాకి ఉండగా ఉండగా హైప్ తగ్గడం వంటివి జరిగాయి. అయితే ఎట్టకేలకి రిలీజ్ నాటికి మంచి బజ్ వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న దారుణ నెగిటివ్ లో గేమ్ ఛేంజర్ కి కూడా ధాటి మొదలైంది. కానీ పర్టిక్యులర్ ఈ సినిమా విషయంలో ఇది హద్దులు దాటింది అని చెప్పాలి.

game changer team gave big twist and revealed shocking truth on leak

కాగా ఎన్నో వందల కోట్లు ఖర్చు చేసిన సినిమా తాలూకా హై క్వాలిటీ ప్రింట్ రిలీజ్ అయ్యిన మొదటి రోజే ఆన్లైన్ లో లీక్ అయ్యినట్టుగా మేము తెలిపాము. కాగా ఈ లీక్ వెనుక ఏదో కుట్ర ఉండి తీరుతుంది అని మెగా అభిమానులు గట్టిగా నమ్మారు. కాగా ఈ జనవరి 10న సినిమా రిలీజ్ కి వస్తే కేవలం ఈ మూడు రోజుల్లోనే చాలా మారిపోయాయి.

ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ టీం ఎందుకు ఈ లీక్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న భారీ నెగిటివ్ కాంపైన్ పై యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు అనేది మెగా అభిమానుల్లో ప్రశ్నగా మారింది. కాగా ఈ అంశంపై చిత్ర యూనిట్ బిగ్ ట్విస్ట్ తో కూడిన షాకింగ్ నిజాలు బయటకి తీసుకొచ్చారు. తమ సినిమా రిలీజ్ కి ముందే కొందరు ముఠా తమకి అడిగిన భారీ మొత్తం ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ హెచ్ డి క్వాలిటీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరింపులు ఇచ్చారు అంటూ తెలిపారు.

అలాగే సినిమాపై కీలక ట్విస్ట్ లు సినిమా కథని పాయింట్ టు పాయింట్ గా సోషల్ మీడియాలో కొందరు కావాలని లీక్ చేసారని ఇంకా సోషల్ మీడియా మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్ బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ సహా యూట్యూబ్ లలో దారుణంగా నెగిటివ్ తీసుకొచ్చారని, వారిని ఎవరినీ వదిలేది లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

game changer team gave big twist and revealed shocking truth on leak

అలాగే తమ సినిమాపై ఇంత నెగిటివ్ చేసిన కుట్రలో మొత్తం 45 మంది ఉన్నారని గుర్తించామని అలాగే వారిపై అధరాలు కూడా ఉన్నాయని వాటితో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అని వెల్లడి చేశారు. కాగా గేమ్ ఛేంజర్ లీక్ లో ఇండస్ట్రీకి చెందిన కొన్ని పెద్ద తలల ఇన్వాల్వ్ మెంట్ కూడా తప్పకుండా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి స్వార్ధం మూలాన ఇదంతా జరిగిందో ఏమో కానీ ఓ పక్క హీరోకి మెయిన్ గా నిర్మాతకి భారీ నష్టం వాటిల్లిందని చెప్పాలి.

దిల్ రాజు కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అది కూడా తన బ్యానర్ లో 50వ సినిమాగా దర్శకుడు శంకర్ తో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసుకున్నారు. సరే నిజంగా అంత డిజాస్టర్ ప్రోడక్ట్ ఈ సినిమా అనుకుంటే అది కూడా కాదు. ఖచ్చితంగా దిల్ రాజు ఇలాంటి ఫలితానికి అర్హులు కాదనే సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు ఏంటి అనేది బయట పడతారో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: dil raju game changer ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X