Game Changer vs Baby John: బాక్సాఫీస్ వద్ద గురుశిష్యుల మధ్య పోటీ.. అట్లీ మూవీతో శంకర్ ఢీ!

Game Changer vs Baby John: గ్లోబల్ సార్ట్ రామ్ చరణ్, సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై మూడేళ్లు దాటుతోంది. కానీ, ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కాలేదు. ఎంతో ఇగర్ గా వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ డైరెక్టర్ శంకర్‌ మాత్రం నిరాశనే మిగిలిచారు. ఈ సినిమాని మధ్యలో ఆపివేసి.. కమల్ హాసన్ 'భారతీయుడు 2'మూవీని విడుదల చేశారు. దీంతో గేమ్ ఛేంజర్ మూవీని పక్కన పెట్టేశాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నానా ప్రయాసపడి 'భారతీయుడు 2' విడుదల చేసినా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో రామ్ చరణ్ సినిమాపై ఫోకస్ పెట్టారని, మూవీలో అక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నట్టు టాక్. కానీ మూవీకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం ఏంటి? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం డైరెక్టర్స్ అట్లీ, శంకర్‌ మధ్య పోటీ నడుస్తుందంటూ నెట్టింట టాక్ నడుస్తోంది.

Game Changer vs Baby John Ram Will Baby John be a Game changer for Varun Dhawan

శంకర్ దర్శకత్వంలో వస్తోన్న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా అట్లీ మూవీతో పోటీ పడనుందట. గురువు, శిష్యుడు మధ్య పోటీ నడుస్తుండటంతో సోషల్ మీడియాలో ఆసక్తి నెలకొంది. మరీ అట్లీ రూపొందిస్తోన్న ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా? సక్సెస్ పుల్ డైరెక్టర్ అట్లీ సైలెంట్‌గా తెరకెక్కిస్తున్న మూవీ బేబీ జాన్. ఈ మూవీ తెరి సినిమాకు హిందీ రీమేక్. ఈ మూవీలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ బాలీవుడ్ లో నటించే మొదటి మూవీ ఇదే. తొలి సినిమానే ప్రముఖ నటుడు వరుణ్ ధావన్‌‌ సరసన అవకాశం దక్కించుకుంది. దర్శకుడు అట్లీకి కూడా బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా అని చెప్పుకోవచ్చు.

ఈ చిత్రం డిసెంబరులో వచ్చే క్రిస్టమస్ ఫేస్టివల్ వరకు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే? బేబీ జాన్ చిత్రం విడుదల రోజే రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' సినిమా కూడా అదే రోజు విడుదల అవ్వనుందని సమాచారం. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Game Changer vs Baby John Ram Will Baby John be a Game changer for Varun Dhawan

కాగా బాక్సాఫీసు వద్ద అట్లీ అండ్ శంకర్ మధ్య గట్టి పోటీ ఉండనుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరీ గురువు సినిమాకు ఎక్కువ కలెక్షన్లు రానున్నాయా? శిష్యుడి మూవీకి రానున్నాయా? అంటూ జనాల్లో సందేహాలు తలెత్తున్నాయి. స్టార్ దర్శకుడైన శంకర్ దగ్గర అట్లీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత మెల్లిమెల్లిగా అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా రాజా రాణి చిత్రాన్ని రూపొందించాడు. తర్వాత విజయ్‌తో తెరి, బిగిల్, మెర్సల్ వంటి హిట్ మూవీలు తీశాడు. ఇక బాలీవుడ్ స్టార్ షారుఖ్‌తో జవాన్ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా 1100 కోట్ల వసూల్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.

More from Filmibeat

Read more about: atlee shankar baby john
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X