twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాప్సీ ‘గేమ్ ఓవర్’.. టైమ్ ఫిక్స్ అయింది!

    |

    హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం 'గేమ్ ఓవర్'. 'మాయా' ఫేం అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఎస్ శశికాంత్, చక్రవర్తి, రామ చంద్ర నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

     ‘Game Over’ released in Tamil, Telugu, and Hindi on June 14

    ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో తాప్సీ వీడియోగ్స్ ఆడే వ్యక్తిగా నటించారు. దాన్ని ఒక వృత్తిగా మలుచుకున్న తాప్సీ... గేమింగ్ వల్ల తన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటనేది తెరపై ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

    టీజర్ మొత్తం ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం సౌండ్స్‌తోనే మేనేజ్ చేస్తూ... సినిమా కాన్సెప్టును వివరించే ప్రయత్నం చేశారు. వై నాట్ స్టూడియో, రియలన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రం చూసిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఇంప్రెస్ అవ్వడంతో పాటు... తన సొంతబేనర్ ద్వారా హిందీలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మూడు భాషల్లో ఈ చిత్రం జూన్ 14న రాబోతోంది.

    తాప్సీ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికొస్తే... గతేడాది తెలుగులో 'నీవెవరో' సినిమాతో పాటు హిందీలో దిల్ జంగ్లీ, సూర్మ, ముల్క్, నీవెవరో, మన్మర్జియాన్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తడ్కా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, సాంద్ కి ఆంఖ్ చిత్రాలతో పాటు జయం రవితో కలిసి తమిళంలో ఓ మూవీ చేస్తోంది.

    English summary
    Taapsee Pannu upcoming film ‘Game Over’ will be simultaneously released in Tamil, Telugu, and Hindi on June 14. Game Over is an upcoming Indian Tamil/Telugu bilingual drama thriller film written and directed by Ashwin Saravanan. The film stars Taapsee Pannu in the main female lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X