తాప్సీ ‘గేమ్ ఓవర్’... గేమింగ్ వల్ల పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగింది?
తాప్సి ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో రూపొందిన చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి బోర్డ్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
వై నాట్ స్థూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఈ నిర్మాణ సంస్థ గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు నిర్మించింది. ఇప్పుడు 'గేమ్ ఓవర్'తో మరోసారి తమిళ, తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ ఎలాంటి డైలాగులు లేకుండా కేవలం సౌండ్స్‌తోనే మేనేజ్ చేస్తూ... సినిమా కాన్సెప్టును వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో తాప్సీ వీడియోగ్స్ ఆడే వ్యక్తిగా నటించారు. దాన్ని ఒక వృత్తిగా మలుచుకున్న తాప్సీ... గేమింగ్ వల్ల తన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటనేది తెరపై ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
నిర్మాత ఎస్.శశికాంత్ మాట్లాడుతూ సరికొత్త కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం తమ గత చిత్రాల తరహా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. తమిళంలో నయనతార హీరోయిన్‌గా 'మయూరి' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ 'గేమ్ ఓవర్' చిత్రానికి దర్శకత్వం వహించారు.
'తాప్సి' మాట్లాడుతూ 'గేమ్ ఓవర్' చిత్రం కథ విన్నప్పుడే సరికొత్తగా ఉందని అనిపించింది. విజయం సాధించే చిత్రం అనిపించింది. 'ఆనందో బ్రహ్మ'తరువాత నా చిత్రాలపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం వమ్ము చేయదని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్ , కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: 'రియల్' సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్, సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, నిర్మాత: ఎస్.శశికాంత్, దర్శకత్వం: అశ్విన్ శరవణన్.


Click it and Unblock the Notifications











