Gandeevadhari Arjuna సెన్సార్ షాకింగ్ రిపోర్ట్.. హాలీవుడ్ స్థాయిలో స్టైలిష్ మేకింగ్‌తో గాండీవధార అర్జున!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్రిల్లియంట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna). విభిన్నమైన కంటెంట్‌ను ఎంచుకొని వరుణ్ తేజ్ చేస్తున్న ప్రయోగంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్ తదితర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సెన్సార్ అధికారులు ఇచ్చిన రిపోర్టు విషయంలోకి వెళితే..
గాండీవధారి అర్జున సినిమా విషయాల్లోకి వెళితే.. హై యాక్షన్ సీక్వెన్స్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలోని స్టంట్స్ మూవీకి హైలెట్‌గా ఉంటాయని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ గ్రాఫ్ పెరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాలోని కంటెంట్‌పై వారు పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు. హీరో వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు టేకింగ్‌పై, కథ, కథనాలపై వారు ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలిసింది. ఈ సినిమాలోని కంటెంట్ గురించి సంతృప్తి చెందిన సెన్సార్ అధికారులు యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించినట్టు మూవీ యూనిట్ తెలిపింది.
గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమా సెన్సార్ రిపోర్టు వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సెన్సార్ అధికారుల నుంచి పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలు ఫిక్స్ చేశారు.

గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా అభిమానులకు కొత్త అనుభూతిని పంచే విధంగా ఈ సినిమా ఉండేలా నిర్మాత ప్రసాద్ అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ చిత్రంలో ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య మరోసారి తన అందచందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో విమలా రామన్, నాజర్ తదితరులు నటిస్తున్నారు.
గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ సినిమాకు సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా ముఖేష్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోల్ల వ్యవహరిస్తున్నారు. ఇంకా పలువురు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాతో భాగమయ్యారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











