200 మందితో అనసూయతో పవన్ స్పెషల్ సాంగ్.. దుమ్ము రేపడం ఖాయం.. గణేశ్ మాస్టర్
టాలీవుడ్ సినిమా దగ్గర భయంకరమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలకి ఒక్క పవర్ స్టార్ మాత్రమే కాకుండా ఏపీకి ఉప ముఖ్యమంత్రి కూడా కావడం విశేషం. ఇలా ఇప్పుడు పవన్ రెండు హోదాల్లో ఉండగా ఇకపై తన నుంచి రానున్న సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అనేలా భారీ హైప్ లో ఉన్నాయి.
ఐతే పవన్ తో సినిమాలు చేయడం అనేది దర్శక నిర్మాతలకి కత్తి మీద సాము లాంటిదే.. పవన్ సరిగ్గా శ్రద్ధ పెడితే ఎలాంటి సినిమా అయినా రెండు మూడు నెలల్లోపు అంతెందుకు ఉదాహరణగా గత ఏడాది వచ్చిన "బ్రో ది అవతార్" నే తీసుకున్నా రోజుల్లో ఫినిష్ చేసి చూపించాడు. కానీ ఒకవేళ లేట్ అయ్యిందా అది దర్శక నిర్మాతలకి కత్తి మీద సాము లాంటిదే..

కాగా అలా ఇప్పుడు పవన్ ఇచ్చే డేట్స్ కోసం ఏకంగా మూడు సినిమాలు నిర్మాతలు, దర్శకులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమాల్లో ఓ సినిమాలో గాను పవన్ తో స్టెప్పేసినట్టుగా తెలుగు టాప్ యాంకర్ బిగ్ స్క్రీన్స్ రంగమ్మత్త అనసూయ భరద్వాజ్ రివీల్ చేయడం వైరల్ గా మారింది. కాగా ఈ మధ్యనే అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో కూడా పవన్ సినిమాలో చేసానని తెలిపింది. అలాగే గతంలోనే అనసూయ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ హిట్ చిత్రం "అత్తారింటికి దారేది" లో ఐటెం సాంగ్ నే చేయాల్సి ఉంది..
కానీ అప్పట్లో అనసూయ ఆఫర్ వచ్చినప్పటికీ వదిలేసినట్టుగా రూమర్స్ వచ్చాయి. కాగా ఇపుడు మళ్ళీ దశాబ్దం తర్వాత ఈ ఇద్దరు ఓ పాటలో చిందేయడం కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఆమె ఓ టీవీ షోలో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ గారితో ఓ సాంగ్ చేసానని ఆ సాంగ్ టెలివిజన్ స్క్రీన్స్ ని ఊపేస్తోంది అంటూ ఎనర్జిటిక్ కామెంట్స్ చేసింది. దీనితో ఈ సాంగ్ పై ఇప్పుడు అంతా చర్చగా మారింది.

మరి అసలు ఆ సాంగ్ ఎందులో అనేది చూస్తే పవన్ ఇప్పుడు చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన "హరిహర వీరమల్లు" లో ఆమె చేసినట్టుగా ఇప్పుడు తెలిసింది. కాగా ప్రముఖ డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ పవన్ కి ఎప్పుడు నుంచో వర్క్ చేస్తున్నారు. మరి తన సారథ్యంలో ఎప్పుడో లాక్ డౌన్ కి ముందే సాంగ్ చేసేశామని క్రేజీ కామెంట్స్ చేశారు. మొత్తం 200 మంది డాన్సర్స్ తో చేసేసాం.. థియేటర్స్ లో దుమ్ము లేచిపోద్ది అంటూ తెలిపాడు. దీనితో తన చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

ఇప్పుడు అనసూయ కూడా చెప్పిన స్టేట్మెంట్ కూడా గణేష్ మాస్టర్ మాటలకి సింక్ అవ్వడంతో ఆ సాంగ్ ఈ భారీ సినిమాలోనే అని కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రంకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా తన కాంపొజిషన్ లో అయితే పవన్, అనసూయ ఇద్దరూ స్టెప్పేయనున్నారని చెప్పాలి. ఇంకా ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, నుపుర్ సనన్ తదితరులు కూడా నటిస్తున్నారు. అలాగే పవన్ తో మెమొరబుల్ హిట్ చేసిన ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











